అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. రాసి పెట్టుంటే ఎన్ని రోజులకైనా అది మనకే దక్కుతుందని అంటుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
షేర్ మార్కెట్‌పై ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఏళ్ల తరబడి చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ వెళ్లినా భారీగా లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
25
రూ. లక్ష పెడితే రూ. 80 కోట్లు
1990లో ఓ వ్యక్తి రూ. లక్షతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీకి చెందిన కొన్ని షేర్లను కొనుగోలు చేశాడు. అయితే వాటిని అతను పెద్దగా పట్టించుకోలేదు. కాలంతో పాటు షేర్ విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాజాగా ఏకంగా వాటి విలువ రూ. 80 కోట్లకు చేరింది.
35
ఎలా వెలుగులోకి వచ్చిందంటే.?
1990లో రూ. 1 లక్షతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో షేర్లు కొన్న వ్యక్తి దానికి సంబంధించిన పత్రాలను ఎక్కడో మూలన పడేశాడు. తాజాగా ఆయన కొడుకు ఆ పత్రాలను గుర్తించి.. వాటి గురించి ఆరా తీశాడు. ప్రస్తుతం ఆ షేర్ల విలువ ఊహకందని విధంగా ఏకంగా రూ. 80 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
స్టార్ మార్కెట్లో ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ చెబుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనినే పవర్ ఆఫ్ హోల్డింగ్ అంటారని అంటున్నారు. షేర్ మార్కెట్ మాయాజాలం అంటే ఇలా ఉంటుందని కొందరు స్పందిస్తే. మరికొందరు ఆ సమయంలో అతను ఎంచుకున్న షేర్ సరైంది కాబట్టే ఇది సాధ్యమైందని మరో యూజర్ కామెంట్ చేశాడు.
55
జేఎస్‌డబ్ల్యూ షేర్ విలువ ఎంతంటే.?
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ. ప్రస్తుతం దీని ఒక షేర్ విలువ సుమారుగా రూ. 1,004.90 వద్ద ఉంది. కంపెనీ రూ. 2.37 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది. దీని షేర్లు ఎప్పటికప్పుడు పెరుగుతూ, దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చాయి.