200 సార్లు పాము కాటు.. 700 సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా బతికే ఉన్న వ్యక్తి: ఎవరో తెలుసా?

Published : May 04, 2025, 04:04 PM IST

అమెరికాకు చెందిన టిం ఫ్రిడే అనే వ్యక్తి 20 ఏళ్లలో 200 సార్లు కొండచిలువ, బ్లాక్ మాంబా వంటి విషపూరిత పాముల కాటుకు గురయ్యాడు. అంతేకాదు.. దాదాపు 700 సార్లు పాము విషాన్ని తన శరీరానికి ఇంజెక్షన్ చేయించుకున్నాడు. అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 

PREV
15
200 సార్లు పాము కాటు.. 700 సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా బతికే ఉన్న వ్యక్తి: ఎవరో తెలుసా?

టిం ఫ్రిడే గతంలో ట్రక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల విషానికి వ్యతిరేకంగా తన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని స్టార్టింగ్ లో తన శరీరానికి విషాన్ని ఎక్కించుకోవడం చేశాడు. అతనిలో రోగనిరోధన శక్తి పెరగడంతో అతని సహకారంతో శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేశారు. ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన యాంటీవెనమ్‌ను తయారు చేశారు. 

25

700 సార్లు పాము విషం ఇంజక్షన్ చేయించుకున్నాడు

సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం టిం ఫ్రిడేను బ్లాక్ మాంబా, కొండచిలువ, కట్లపాము, టైపాన్ వంటి విషపూరిత పాములు 200కు పైగా సార్లు కరిచాయి. అతనికి 700కు పైగా సార్లు పాము విషం ఇంజెక్షన్ ఇచ్చారు. అతను ఇంకా బతికే ఉన్నాడు. ఒకసారి వరుసగా రెండు కొండచిలువలు కరిచిన తర్వాత అతను కోమాలోకి వెళ్ళాడు. కానీ తిరిగి కోలుకున్నాడు. 

35

పాము కాటుకు చికిత్స 

ప్రస్తుతం పాము కాటుకు చికిత్స.. కరిచిన పాము విషాన్ని ప్రత్యేక యాంటీవెనమ్‌తో కలపడంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గుర్రాల వంటి జంతువులలో పాము విషాన్ని ఇంజెక్ట్ చేసి, వాటి రక్తం నుండి యాంటీబాడీస్‌ను సేకరిస్తారు. దీని నుండి యాంటీవెనమ్ తయారు చేస్తారు. అయితే ఈ పద్ధతికి లిమిట్స్ ఉన్నాయి.

ఒకే పాము జాతి విషం, ఆ పాము నివసించే ప్రదేశాన్ని బట్టి మారవచ్చు. అంటే ఒక దేశంలో పాముల కోసం తయారు చేసిన యాంటీవెనమ్ మరొక దేశంలో అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.

45

కొత్త యాంటీవెనమ్ పరిశోధనలు

పాముకాటుకు మెరుగైన పరిష్కారం కోసం శాస్త్రవేత్తల బృందం వేరే రకమైన రక్షణపై దృష్టి సారించింది. అంటే యాంటీబాడీస్ ని న్యూట్రల్ చేయడం. 

బయోటెక్ సంస్థ సెంటివాక్స్ అధిపతి డాక్టర్ జాకబ్ గ్లెన్‌విల్లే బృందం, టిం ఫ్రిడేతో కలిసి అత్యంత శక్తివంతమైన యాంటీబాడీని తయారు చేయడానికి కృషి చేస్తోంది. ఫ్రిడే రక్తంలో ఎలాపిడ్ పాములు ఉపయోగించే మూడు ప్రధాన రకాల న్యూరోటాక్సిన్‌లతో పోరాడగల యాంటీబాడీస్ ఉన్నాయి. ఈ యాంటీబాడీస్ నుండి యాంటీవెనమ్ తయారు చేశారు. వీటిని ఎలుకలపై పరీక్షించారు.

55

పరీక్షల సమయంలో యాంటీవెనమ్ కాక్‌టెయిల్ 19 పాము జాతులలో 13 జాతుల విషాన్ని న్యూట్రలైజ్ చేసింది. మిగిలిన పాము జాతుల విషం సోకిన ఎలుకలు కొంత అనారోగ్యం పాలయ్యాయి. 

సైంటిస్ట్ డా.గ్లెన్‌విల్లే మాట్లాడుతూ తాము చేసిన పరిశోధనల వల్ల పాము కాటు ఇకపై పెద్ద ప్రమాదకరం కాదని భరోసా ఇచ్చారు. 

టిం ఫ్రిడే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జనానికి పాముల వల్ల మరణం సంభవించకూడదని, తాను ఈ ప్రయోగాలకు అంగీకరించినట్లు తెలిపాడు.  

Read more Photos on
click me!

Recommended Stories