LPG Cylinder Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర... హైదరాబాద్ లో ఎంతకు చేరిందో తెలుసా?
LPG Cylinder Price : దేశంలో వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గింది. కొత్త ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. హైదరాబాద్ లో సిలిండర్ ధర ఎంతుందో తెలుసా?
LPG Cylinder Price : దేశంలో వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గింది. కొత్త ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. హైదరాబాద్ లో సిలిండర్ ధర ఎంతుందో తెలుసా?
ఆయిల్ కంపనీలు ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.44 తగ్గించారు... దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 19 కిలోల సిలిండర్ ధర రూ.1985 గా ఉంది. ఇదే దేశ రాజధాని డిల్లీలో అయితే రూ.41 తగ్గి కేవలం రూ.1762 కే కమర్షియల్ సిలిండర్ వస్తోంది.
ఇక ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. గత నెలలో ధరనే ఈ నెలలో కూడా కొనసాగించనున్నారు.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతి నెలా మొదటి తేదీనే ఈ రేట్లను సవర్తిస్తుంటాయి ఆయిల్ కంపనీలు.
చాలారోజులుగా పెట్రోల్, డీజిల్ వంటి రవాణా ఇంధనాల ధరలు స్థిరంగా ఉన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి... కానీ వాణిజ్య సిలిండర్ ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
గత ఫిబ్రవరిలో కూడా కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించారు. ఇలా ఆ నెలలో రూ.7 తగ్గించినట్లే తగ్గించి తర్వాతి నెల మార్చిలో రూ.6 పెంచారు. ఇలా గత రెండు నెలలుగా కొద్దిమొత్తంలోనే హెచ్చుతగ్గులు ఉండగా ఏప్రిల్ లో మాత్రం వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గించారు.
ఇలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధర రూ.40 కి పైగా తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశమే. గ్యాస్ ధరలు పెరగడం హోటల్స్, రెస్టారెంట్స్ లో ఆహార పదార్థాల ధరలు పెరగడానికి ఓ కారణం. ప్రస్తుతం సిలిండర్ ధర భారీగా తగ్గాయి కాబట్టి అహార పదార్థాల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. తద్వారా సామాన్యులపై కాస్త భారం తగ్గుతుంది.