మీరు చిన్న మొత్తాల్లో సేవింగ్స్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ బెస్ట్. ఎలాంటి టెన్షన్ లేకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. చిన్న అమౌంట్ తో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అన్ని బ్యాంకులు, పొదుపు ఖాతా పథకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు, ఛార్జీలు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. దీన్ని బట్టి ఏప్రిల్ 1 నుంచి సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, కేవీపీ వంటి ఈ పథకాల వడ్డీ రేట్లు ఏవిధంగా మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ పొదుపు పథకం వడ్డీ రేటు సంవత్సరానికి 4%
1 సంవత్సరం పెట్టుబడి వడ్డీ రేటు సంవత్సరానికి 6.9%, రూ.10,000 కు రూ.708 (క్వార్టర్లీ)
2 సంవత్సరాల పెట్టుబడి వడ్డీ రేటు సంవత్సరానికి 7.0%, రూ.10,000 కు రూ.719 (క్వార్టర్లీ)
3 సంవత్సరాల పెట్టుబడి వడ్డీ రేటు సంవత్సరానికి 7.1%, రూ.10,000 కు రూ.719 (క్వార్టర్లీ)
5 సంవత్సరాల పెట్టుబడి వడ్డీ రేటు సంవత్సరానికి 7.5%, రూ.10,000 కు రూ.771 (క్వార్టర్లీ)
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ పథకం) వడ్డీ రేటు 6.7%. ఇది క్వార్టర్లీ టైమ్ పీరియడ్ కి వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 8.2%. ఇది కూడా క్వార్టర్లీ టైమ్ పీరియడ్ కి వడ్డీ రేటు రూ.10,000 రూ.205 వడ్డీ లభిస్తుందన్న మాట. ఇదే స్కీమ్ కి నెలకు వచ్చే సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 7.4%. అంటే నెలకు వడ్డీ రేటు 10,000 రూ.కు 62 రూ. వస్తుందన్న మాట.
ఇది కూడా చదవండి మూడు రోజుల్లోనే పీఎఫ్ డబ్బులు మీ ఖాతాల్లోకి.. EPFO కొత్త మార్పులు: ఏప్రిల్ 1, 2025 నుండి అమలు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (VIII) వడ్డీ రేటు 7.7%. అంటే రూ.10,000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ టైమ్ కి రూ.14,490 లభిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం వడ్డీ రేటు సంవత్సరానికి 7.1%.
కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు 7.5% . ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 115 నెలలు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటు 7.5%. ఈ స్కీమ్ ద్వారా మీరు రూ.10,000 పెట్టారనుకోండి. క్వార్టర్లీ కి రూ.11,602 లభిస్తుంది.
సుకన్య సమృద్ధి ఖాతా యోజన వడ్డీ రేటు సంవత్సరానికి 8.2%
సూచన: మీరు సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌లో వడ్డీ రేట్ల మరిన్ని వివరాలు తెలుసుకోండి.