Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఏప్రిల్ నుంచి ప్రతీ ఒక్కరికీ పెరగనున్న జీతాలు. ఎంతో తెలుసా.?
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. వీటిలో ఉద్యోగుల జీతం పెరగడం ఒకటి. సంవత్సర ఆదాయం 12 లక్షలు దాటితేనే పన్ను చెల్లించే విధానం అమల్లోకి రానుంది. దీంతో ఆదాయపు పన్ను భారం తగ్గుతుండడంతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..