Richest Young Woman : ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత యువతి.. ఎవరామె, ఆదాయమెంత?

Published : Oct 02, 2025, 02:13 PM IST

Richest Young Woman : ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ఎలాన్ మస్క్, ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ భారతీయ యువతి కూడా అంబానీ, అదానీల సరసన చేరుకుంది. ఆమె ఎవరో తెలుసా?

PREV
17
అంబానీ, అదానీ సరసన నిలిచిన ఈ యువతి ఎవరు?

Richest Young Woman : ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. చరిత్రలో తొలిసారిగా 500 బిలియన్ డాలర్ల నికర విలువను అందుకున్న వ్యక్తి ఇతనే. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి టెక్ కంపెనీల విజయంతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే తాజాగా M3M హురున్ ఇండియా ప్రకారం ఓ యువతి అంబానీ, అదానీల సరసన చేరింది. ఇలా వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ మస్క్ తో పాటు ఇండియన్ రిచ్చెస్ట్ యువతి ఆదాయం గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

27
ఫోర్బ్స్ జాబితాలో మస్క్ టాప్

ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. చరిత్రలో తొలిసారిగా 500 బిలియన్ డాలర్ల నికర విలువను అందుకున్న వ్యక్తి ఇతనే. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి టెక్ కంపెనీల విజయంతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

37
భారీగా పెరిగిన టెస్లా షేర్లు

బుధవారం టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. షేర్లు గరిష్ట స్థాయికి చేరినప్పుడు, మస్క్ నికర విలువ 500.1 బిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి షేరు ధర కొద్దిగా తగ్గినా, అతను ప్రపంచంలోనే మొదటి 500 బిలియన్ డాలర్ల బిలియనీర్‌గా నమోదయ్యారు.

47
ఎలాన్ మస్క్ ఆస్తి

మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా షేర్లే. కంపెనీలో అతనికి 12.4% కంటే ఎక్కువ వాటా ఉంది. ఇటీవల అతను సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అదనంగా కొనుగోలు చేయడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. దీంతో టెస్లా షేర్ల విలువ పెరుగుతూనే ఉంది.

57
ఫోర్బ్స్ జాబితాలో టాప్ లో ఎలాన్ మస్క్

ఫోర్బ్స్ ప్రకారం… 2020లో మస్క్ నికర విలువ కేవలం 20 బిలియన్ డాలర్లు. కానీ గత నాలుగేళ్లలో అతని సంపద పది రెట్లు పెరిగి, నేడు 500 బిలియన్ డాలర్ల రికార్డును అందుకుంది. టెక్నాలజీ, పెట్టుబడులలో మస్క్ ప్రభావం అతనిని అగ్రస్థానంలో నిలబెడుతోంది.

67
శివ్ నాడార్

భారత్‌లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం, 205 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు. వీరిలో శివ నాడార్ $31.5 బిలియన్ల నికర విలువతో టెక్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. అతను భారతదేశంలో నాల్గవ ధనవంతుడు.

77
శివనాడార్ కూతురు ఆదాయమెంతో తెలుసా?

 ఆసక్తికర విషయం ఏమిటంటే M3M హురుర్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం రూ.2.84 లక్షల కోట్లతో రోష్ని నాడార్ మల్హోత్రా అత్యంత ధనిక మహిళగా నిలిచారు. ఈమె హెచ్సిఎల్ వ్యవస్థాపకులు శివనాడార్ కూతురు.. ప్రస్తుతం హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఈమెకు హెచ్సిఎల్ లో అత్యధిక వాటా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories