పండుగల సమయంలో..
సాధారణంగా పండుగల సీజన్ మొదలవ్వగానే రైల్వే స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోతుంటుంది. జనరల్ టికెట్ కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కాలనుకున్న ట్రైన్ కూడా మిస్ అవుతుంటుంది. అలాంటి టైంలో UTS మొబైల్ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది.
ఈ యాప్ లో ఒకప్పుడు రైల్వే స్టేషన్ లేదా ట్రాక్ కి 5 కిలోమీటర్ల పరిధిలో నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకునే వీలుండేది. కానీ దాన్ని సిటీలో 10 కిలోమీటర్లు, ఇతర ప్రాంతాల్లో 20 కిలోమీటర్లకు పెంచారు. మీరు బయటి నుంచి కాకుండా స్టేషన్ పరిధిలోనే ఉంటే ఆ ప్రాంగాణంలో ఉండే ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ క్యూఆర్ కోడ్ సదుపాయం ప్రస్తుతం సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.