Capsicum Crop: క్యాప్సికం పండిస్తూ ఏడాదికి 4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పాతికేళ్ల యువతి

Published : Oct 02, 2025, 01:20 PM IST

క్యాప్సికం పంట (Capsicum Crop)లో ఏడాదికి నాలుగుకోట్ల రూపాయలు సంపాదించడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ పాతికేళ్ల యువతి ఈ విజయాన్ని సాధించింది. ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరీ వ్యవసాయంలోకి అడుగుపెట్టింది.

PREV
15
సొంతగడ్డ మీద పెద్ద విజయం

ఏడాదికి కోట్ల రూపాయల సంపాదించాలంటే పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేయాలనీ, అమెరికాకు ఆన్ సైట్ వెళ్లాలని అనుకుంటారు. సొంత ఊర్లోనే తనకున్న పొలంలోనే ఒక అమ్మాయి సిరులు పండిస్తోంది. ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలను సంపాదిస్తోంది. పట్టుదల, అవకాశాలను సద్వినియోగం చేసే గుణం ఉంటే చాలు ఉన్నచోటే విజయాన్ని సాధించవచ్చని నిరూపించింది యువరైతు ప్రణీత వామన్. ఆమె మహారాష్ట్రలోని పూణేకు చెందిన యువతి. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసేది. కానీ ఆ ఉద్యోగంలో ఆమెకి ఎలాంటి సంతృప్తి లేదు. అందుకే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ పొందింది. తనకున్న పొలంలోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది.

25
తండ్రి సహకారం

తన కూతురు తీసుకున్న నిర్ణయానికి తండ్రి కూడా సహకరించారు. 2020లో తమకున్న సొంత పొలంలోనే క్యాప్సికం సాగును ప్రారంభించింది ప్రణీత. పాలిహౌస్ పద్ధతిలో పంటలు పండించడంలో ఆమె ట్రైనింగ్ తీసుకోవడంతో పాలీహౌస్ వ్యవసాయాన్ని మొదలుపెట్టింది. ప్రభుత్వం కూడా 50 శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం చేసింది. తక్కువ పెట్టుబడితోనే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని కూడా వాడుకుంది. ప్రణీత నాలుగు నెలలు కష్టపడింది. 40 టన్నుల క్యాప్సికం దిగుబడి వచ్చింది. ఆ సమయంలో కరోనా లాక్ డౌన్ ఉండడంతో ఆన్లైన్లోనే అమ్మకాలు మొదలుపెట్టింది. మొదటి ఏడాదిలోనే నలభై టన్నుల క్యాప్సికం రావడం అంటే మామూలు విషయం కాదు.

35
బెల్ పప్పర్స్ కూడా

క్యాప్సికం లో గ్రీన్ కలర్ తో పాటు పసుపు, ఎరుపు రంగులో ఉన్న బెల్ పెప్పర్స్ కి మంచి ధర దక్కుతుంది. అందుకే గ్రీన్ క్యాప్సికంతో పాటు ఎరుపు, పసుపు బెల్ పెపర్స్ కూడా పండించ సాగింది. అలా ఆమెకు మొదటి ఏడాదిలోనే 32 లక్షల టర్నోవర్ వచ్చింది. తన మీద తనకు నమ్మకంతో 2021లో చుట్టుపక్కల ఉన్న భూములను కూడా లీజుకు తీసుకుంది. దాదాపు పాతిక ఎకరాల వరకు క్యాప్సికం పంటను విస్తరించింది. ఈసారి కూడా క్యాప్సికం విరగ కాసింది. పండిన క్యాప్సికం మొత్తాన్ని అమ్మితే నాలుగు కోట్ల దాకా టర్నోవర్ వచ్చింది. ఇక ఖర్చులు పోను ఆమెకు 2.25 కోట్ల రూపాయలు మిగిలాయి. అంటే అంత మొత్తం ఆమెకు లాభంగా మిగిలింది. ఎన్నేళ్లు ఉద్యోగం చేస్తే ఆమె ఆ మొత్తాన్ని పొదుపు చేయగలదు.

45
ఎక్కడ అమ్ముతోంది

ప్రణీత చెబుతున్న ప్రకారము స్థానికంగా ఉన్న మట్టినే పంటల కోసం వినియోగిస్తోంది. ఆ మట్టిలో వర్మీ కంపోస్టు, బయో ఫెర్టిలైజర్లను కూడా కలిపి పంటలను పండిస్తోం.ది క్యాప్సికం వంటి కూరగాయలు త్వరగానే పాడవుతాయి. కాబట్టి సాగు ప్రారంభించే ముందే ఎక్కడ మార్కెటింగ్ చేయాలో కూడా ముందుగానే డిసైడ్ అవ్వాలని చెబుతోంది ప్రణీత. ఈమె తన పంటను జైపూర్, నాసిక్, దాదర్ వంటి ప్రదేశాలలో హోల్ సేల్ వ్యాపారులకు నేరుగా అమ్ముతుంది. పంట చేతికి అందడానికి ముందే ఆర్డర్లను తీసుకుంటుంది. ప్రతి ఉదయం కొత్త రేట్లు ప్రకటిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి ఎలాంటి మార్కెటింగ్ సమస్య ఇంతవరకు రాలేదు.

55
పాలీహౌస్ తోనే సక్సెస్

సాధారణంగా పండిన క్యాప్సికంతో పోలిస్తే పాలీహౌస్లో పెరిగే క్యాప్సికంకు ఎక్కువ ధర లభిస్తుంది. కిలో 100 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అందుకే పాలీహౌస్ పద్ధతిలోనే క్యాప్సికమ్ పండించడం ప్రారంభించింది. ప్రణీత ఎకరానికి పాలీహౌస్లో క్యాప్సికం సాగు కోసం 8 నుండి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ ఖర్చులు పోను చేతికి 20 నుంచి 22 లక్షల రూపాయల లాభం కనిపిస్తుంది. ఎకరానికి 20 లక్షల లాభం రావడం అంటే సాధారణ విషయం కాదు.

Read more Photos on
click me!

Recommended Stories