ఇదెక్క‌డి మాస్‌రా మామా.. LIC మ‌న డ‌బ్బులను ఎందులో పెట్టుబ‌డి పెడుతుందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

Published : Jan 07, 2026, 11:42 AM IST

LIC: దేశంలో, ఆ మాట‌కొస్తే ప్ర‌పంచంలో అతి పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ‌గా పేరుగాంచింది ఎల్ఐసీ. దేశంలో కోట్లాది మంది ఎల్ఐసీలో పాల‌సీల‌ను క‌లిగి ఉన్నారు. అయితే ఈ సంస్థ ప్ర‌జ‌ల డ‌బ్బును ఎందులో పెట్టుబ‌డి పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? 

PREV
14
ఐటీసీ షేర్లకు బిగ్ షాక్: రెండు రోజుల్లో భారీ పతనం

సిగరెట్ వ్యాపారంలో ప్రధాన కంపెనీగా ఉన్న ఐటీసీ షేరు ఈ ప్రకటన తర్వాత తీవ్రంగా పడిపోయింది. ఒక్కరోజులోనే దాదాపు 10 శాతం నష్టం నమోదుకాగా, ఆ తర్వాతి రోజు మరో 4 శాతం మేర క్షీణించింది. రెండు రోజుల్లో కలిపి చూస్తే 14 శాతానికి పైగా పతనం కనిపించింది. దీంతో ఐటీసీ షేరు మూడేళ్లలోనే కనిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ. 350 స్థాయి వద్ద ట్రేడవుతుండగా, ఇంట్రాడేలో రూ. 345.25 వరకు పడిపోయింది.

24
మార్కెట్ క్యాప్‌లో భారీ కోత: వేల కోట్ల సంపద ఆవిరి

షేరు ధర పడిపోవడంతో ఐటీసీ మార్కెట్ విలువలో భారీ కోత పడింది. రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 72,300 కోట్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం ఐటీసీ మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ. 4.38 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే ఈ పతనంతో ఇన్వెస్టర్ల సంపద వేల కోట్లలో ఆవిరైనట్లే. బ్రోకరేజీ సంస్థలు కూడా స్టాక్ రేటింగ్ తగ్గించడం, టార్గెట్ ధరల్లో కోత విధించడం ఈ పతనానికి మరింత బలం చేకూర్చింది.

34
ఎల్ఐసీకి భారీ దెబ్బ: రెండు రోజుల్లో రూ. 11,460 కోట్ల నష్టం

ఐటీసీలో పెద్ద పెట్టుబడులు పెట్టిన దేశీయ సంస్థాగత మదుపరులకూ ఈ పతనం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిస్థితి గమనించాల్సిందే. ఐటీసీలో ఎల్ఐసీకి 15.86 శాతం వాటా ఉంది. అంటే దాదాపు 1,98,58,07,233 షేర్లు ఎల్ఐసీ వద్ద ఉన్నాయి. షేరు ధర రెండు రోజుల్లో పడిపోవడంతో ఎల్ఐసీకి సుమారు రూ. 11,460 కోట్ల నష్టం వాటిల్లింది. ఇంట్రాడే గరిష్ఠ పతనం లెక్కిస్తే ఈ నష్టం రూ. 12 వేల కోట్లను దాటింది.

44
ప్రజలకు ఇన్సూరెన్స్… సిగరెట్ కంపెనీలో పెట్టుబడి

ప్రజలకు జీవిత ఇన్సూరెన్స్ భద్రత అందించే సంస్థగా ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా విశ్వాసం ఉంది. అలాంటి సంస్థ సిగరెట్ల తయారీ చేసే ఐటీసీలో భారీగా పెట్టుబడి పెట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవైపు ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులపై ప్రభుత్వం పన్నులు పెంచుతుంటే, మరోవైపు ప్రజల డబ్బుతో నడిచే ఇన్సూరెన్స్ సంస్థ అలాంటి కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉండటం గ‌మ‌నార్హం. తాజాగా ఎల్ఐసీ న‌ష్టాల‌తో ఈ విష‌యం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది.

గమనిక: ఎల్ఐసీ ఐటీసీలో పెట్టుబడి పెడుతుందనడంలో నిజం ఉన్నా.. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఐటీసీ కంపెనీ కేవలం సిగరెట్ల తయారీలో మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తుందనే విషయాన్ని గమనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories