Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా

Published : Jan 19, 2026, 09:50 AM IST

Kia Car: కియా కొత్త కారు వచ్చేస్తోంది.  కియా కారెన్స్ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది ఇప్పుడు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ 7-సీటర్ మోడల్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు లగ్జరీ కారు. కానీ తక్కువ రేటుకే వస్తుంది.

PREV
14
కియా లగ్జరీ కాదు

లగ్జరీ కారు కొనాలని ప్రతి ఒక్కరి కోరిక. కానీ ఈ కారు కొనాలంటే పాతిక లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ కియా ఇప్పుడు తక్కువ ధరలోనే లగ్జరీ కారు తీసుకొస్తోంది. కియా ఇండియా కారెన్స్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త వేరియంట్ ధర G1.5 పెట్రోల్ కోసం ₹12,54,900 (ఎక్స్  షోరూమ్), G1.5 టర్బో పెట్రోల్ కోసం ₹13,41,900, D1.5 డీజిల్ కోసం ₹14,52,900గా ఉంది. ఇది చాలా తక్కువ రేటు అనే చెప్పాలి.

24
కియా 7 సీటర్

ఈ కియా లగ్జరీ కారు 7 సీటర్. ఈ కారు ఇప్పటికే ఉన్న వేరియంట్లలో అప్‌గ్రేడ్ చేయకుండానే ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం అందుబాటులోకి వస్తోంది. 7 సీటర్ లగ్జరీ కారు కావాలనుకునే వారు ఈ కియా కారును సెలెక్ట్ చేసుకుంటే మంచిది.

34
సన్ రూఫ్ తో సహా

సన్ రూఫ్ అంటే చాలు అందరికీ లగ్జరీ కారు కొనాలనుకుంటారు. కానీ కేవలం తక్కువ ధరలోనే కియా సన్ రూఫ్ కారు వచ్చేసింది.  అందులోనూ ఇది స్కై లైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఇది G1.5 పెట్రోల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ పవర్‌ట్రెయిన్‌తో సన్‌రూఫ్ ఇవ్వడం ఇదే మొదటిసారి.

44
ఎన్నో సౌకర్యాలు

ఈ కియా కారులో సన్‌రూఫ్‌తో పాటు చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఈ కారులో క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్స్‌తో బయటి లైటింగ్ మెరుగుపరిచారు. ఇది హై-ఎండ్ వేరియంట్ లైటింగ్‌కు సమానంగా ఉంటుంది. డ్రైవర్-సైడ్ పవర్ విండోలో ఆటో అప్/డౌన్ ఫంక్షన్ కూడా ఉంది. ఇంత తక్కువ ధరలో సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఫీచర్లతో కియా, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో కారెన్స్ క్లావిస్ ధరను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మూడు-వరుసల MPV విభాగంలో ధరను పోటీగా ఉంచింది.

Read more Photos on
click me!

Recommended Stories