PPF: సంపాదించే డబ్బును భద్రంగా పెట్టుబడి పెట్టి, భవిష్యత్తుకు ఉపయోగపడే నిధిగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రూ. 2 వేల పెన్షన్‌తో ఎంత డబ్బు సృష్టించవచ్చో తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక దీర్ఘకాలిక ప్రభుత్వ పొదుపు పథకం. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల ద్వారా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడికి భారత ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. అందుకే ఇది రిస్క్ లేని పెట్టుబడిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ పూర్తిగా పన్ను రహితం.
25
పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు
పీపీఎఫ్ స్కీమ్‌కు ఉండే ప్రధాన ఆకర్షణ పన్ను మినహాయింపులు.
* పెట్టుబడి మొత్తం 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
* పెట్టుబడిపై వచ్చే వడ్డీపై పన్ను లేదు.
* మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం. అంటే ఇది EEE (Exempt–Exempt–Exempt) క్యాటగిరీ స్కీమ్.
35
నెలకు రూ.2000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
ఒకవేళ మీరు ఈ పథకంలో నెలవారీ పెట్టుబడి రూ. 2000 పెట్టారనుకుందాం. దీంతో వార్షిక పెట్టుబడి రూ.24,000 అవుతుంది. పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు ఉంటుంది. దీంతో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 3,60,000 అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంలో 7.1% వడ్డీ లభిస్తుంది. దీంతో 15 ఏళ్ల తర్వాత మీకు సుమారు రూ.6,08,000 మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. అంటే మీ పెట్టుబడిపై దాదాపు రూ.2.48 లక్షల వడ్డీ ఆదాయం పొందినట్టే. చిన్న మొత్తంతో ప్రారంభించినా, క్రమశిక్షణతో కొనసాగిస్తే మంచి నిధి సిద్ధమవుతుంది.
* 15 ఏళ్ల తర్వాత ఖాతాను ప్రతి 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం
* 5వ సంవత్సరం తర్వాత పాక్షిక ఉపసంహరణ సదుపాయం
* 3వ సంవత్సరం నుంచి రుణ సౌకర్యం కూడా లభిస్తుంది
55
ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుంది?
భవిష్యత్తు కోసం భద్రమైన పొదుపు కోరుకునేవారు, పన్ను భారం తగ్గించుకోవాలనుకునేవారు, రిస్క్ తీసుకోకుండా దీర్ఘకాల పెట్టుబడి చేయాలనుకునేవారు, జీతం తీసుకునే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారికి ఈ పథకం మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి, నెమ్మదిగా లక్షల రూపాయల నిధిని సృష్టించాలంటే పీపీఎఫ్ మంచి ఎంపిక.
గమనిక: ఇక్కడ ఇచ్చిన వడ్డీ రేట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని వివరించాం. వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. పెట్టుబడి నిర్ణయాలకు ముందు అధికారిక సమాచారం పరిశీలించాలి.