Gold Loan: ఫిబ్ర‌వ‌రి 1 త‌ర్వాత గోల్డ్ లోన్ తీసుకునే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. కార‌ణం ఏంటంటే.?

Published : Jan 18, 2026, 02:40 PM IST

Gold Loan: బంగారం జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. తులం ధ‌ర ఏకంగా రూ. ల‌క్ష‌న్న‌కు చేరింది. ఈ నేప‌థ్యంలో గోల్డ్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే బంగారంపై రుణం తీసుకునే వారు ఫిబ్ర‌వ‌రి 1 వ‌ర‌కు ఆగ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
గోల్డ్ లోన్ ప్లాన్ చేస్తున్నారా?

బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకునేవారికి ఫిబ్రవరి 1 కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో గోల్డ్ లోన్ రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అవి అమలైతే సామాన్యులకు తక్కువ వడ్డీతో రుణాలు లభించే అవకాశాలు పెరుగుతాయి.

25
బడ్జెట్‌పై గోల్డ్ లోన్ పరిశ్రమ అంచనాలు

ముత్తూట్ ఫైనాన్స్, మన్నప్పురం ఫైనాన్స్ వంటి ప్రముఖ NBFCలు ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టాయి. ముఖ్యంగా బ్యాంకుల మాదిరిగానే తమకూ ప్రాధాన్యతా రంగ రుణ హోదా ఇవ్వాలని కోరుతున్నాయి. ఇలా జరిగితే గోల్డ్ లోన్ రంగంలో ఖర్చులు తగ్గి, కస్టమర్లకు నేరుగా లాభం చేకూరుతుందని పరిశ్రమ భావిస్తోంది.

35
చిన్న మొత్తాల రుణాలే ఎక్కువ…

గోల్డ్ లోన్ తీసుకునే వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారే. గణాంకాల ప్రకారం చాలా రుణాలు రూ.50 వేల లోపే ఉంటాయి. వైద్య అవసరాలు, పిల్లల చదువు, వ్యవసాయం, చిన్న వ్యాపారాల కోసం ఈ రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు ఇలాంటి రుణాలు ఇస్తే వారికి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కానీ అదే పనిని NBFCలు చేస్తే ఆ సౌకర్యం ఉండదు.

45
NBFCలకు PSL హోదా వస్తే ఏం మారుతుంది?

ప్రస్తుతం NBFCలు మార్కెట్‌లో ఎక్కువ వడ్డీకి నిధులు సమకూర్చుకుంటున్నాయి. దాంతో చివరకు కస్టమర్‌పై భారంగా మారుతోంది. బ్యాంకుల మాదిరిగానే NBFCలకు కూడా PSL హోదా ఇస్తే, వారి నిధుల ఖర్చు తగ్గుతుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని ప్రజలకు తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్‌లు అందే అవకాశం ఉంటుంది. ఇది బడ్జెట్‌లో ప్రకటిస్తే గోల్డ్ లోన్ రంగంలో పెద్ద మార్పు రావచ్చు.

55
UPI ద్వారా గోల్డ్ క్రెడిట్ లైన్… కొత్త ఆలోచన

డిజిటల్ చెల్లింపుల్లో UPI కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గోల్డ్ లోన్ పరిశ్రమ భావిస్తోంది. UPI ద్వారా గోల్డ్ క్రెడిట్ లైన్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచింది. దీని ద్వారా కస్టమర్లు అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు, ఉన్నప్పుడు తిరిగి చెల్లించవచ్చు. ఇలా రివాల్వింగ్ క్రెడిట్ లైన్ వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories