2026 AI Impact : ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? నిపుణుల విశ్లేషణ ఇదే !

Published : Jan 02, 2026, 11:24 PM IST

Job Market 2026 AI Impact : 2026లో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏఐ ప్రభావం, శాలరీ హైక్, ఏ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి? 2026లో ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? అనే విషయాల పై నిపుణుల విశ్లేషణలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఏఐ దెబ్బ.. 2030 నాటికి ఈ 3 స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం.. లేదంటే కష్టమే!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగుల మనసులో మెదులుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఏఐ కారణంగా నిజంగానే మార్కెట్లో ఉద్యోగాలు తగ్గిపోయాయా?. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, వేతనాల పెంపు నెమ్మదించడం, తరచూ ఉద్యోగాలు మారుతున్న జెన్ జీ ధోరణి.. ఇలా అనేక అంశాలు ఉద్యోగ ప్రపంచంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 2026లో, ఆ తర్వాత జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఉద్యోగులు ఎలాంటి మార్పులకు సిద్ధంగా ఉండాలి? అనే విషయాలపై పలువురు మార్కెట్ నిపుణులు పలు విషయాలను, మార్కెట్ పోకడలను విశ్లేషణ చేస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు. భారతదేశంలో జాబ్ మార్కెట్ భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, అవసరమైన నైపుణ్యాల గురించి వారు చెబుతున్న కీలక విషయాలు గమనిస్తే..

26
ఉద్యోగాలు ఉన్నాయి.. కానీ..

ప్రస్తుతం అందరూ అనుకుంటున్నట్లుగా భారతదేశంలో హైరింగ్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోలేదు. అయితే, ఈ ప్రక్రియలో గణనీయమైన మార్పు వచ్చింది. విశ్లేషకుల ప్రకారం.. కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాల ఎంపికలో చాలా నిశితంగా వ్యవహరిస్తున్నాయి.

2021-22 సంవత్సరాల్లో కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు కంపెనీల ఫోకస్ ఎక్కువ మందిని చేర్చుకోవడం మీద కాకుండా, సరైన నైపుణ్యాలు ఉన్న తక్కువ మందిని ఎంచుకోవడం మీద ఉంది. అంటే, మార్కెట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నది ప్రశ్న కాదు.. మీరు ఆ ఉద్యోగానికి ఎంత విలువను జోడించగలరు, మీకు ఉన్న స్కిల్స్ కంపెనీకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేదే అసలైన సవాలుగా ఉందని చెబుతున్నారు.

36
ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాలు ఇవే

అన్ని రంగాల్లోనూ మాంద్యం లేదా నిరాశాజనక వాతావరణం లేదు. కొన్ని సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన వనరులు, సప్లై చైన్ వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది.

దీంతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) భారతదేశంలో తమ విస్తరణను వేగవంతం చేశాయి. కేవలం బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్, పూణే, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి నగరాల్లో కూడా ఇవి విస్తరిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే.. ఏఐ, డేటా సైన్స్, ఫైనాన్స్, అనలిటిక్స్ విభాగాల్లో హై వాల్యూ ఉద్యోగాలు కొత్తగా వస్తూనే ఉన్నాయి. కాబట్టి సరైన డొమైన్ నాలెడ్జ్ ఉన్నవారికి అవకాశాలకు కొదవలేదు.

46
జీతాల పెంపు ఎందుకు తగ్గింది?

గత రెండేళ్లలో (2021-23) ఉద్యోగుల వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. అయితే, ఆ వేగవంతమైన వృద్ధి తరువాత కంపెనీలు ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటున్నాయి. దీనిని మార్కెట్ కరెక్షన్‌గా భావించవచ్చు. అంతమాత్రాన మంచి నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ తగ్గిందని అర్థం కాదు. ఇదే సమయంలో ఐఏ ప్రభావం కూడా మొదలైంది.

ప్రస్తుతం మార్కెట్లో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగి హోదా కంటే, అతనికి ఉన్న నైపుణ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఈఎస్‌జీ (ESG) వంటి స్కిల్స్ ఉన్నవారికి ఇప్పటికీ మంచి ప్యాకేజీలు లభిస్తున్నాయి. కాబట్టి జీతం అనేది ఇప్పుడు పూర్తిగా మీ స్కిల్ సెట్‌పై ఆధారపడి ఉంటుంది.

56
ఏఐ ఉద్యోగాలను మింగేస్తుందా?

చాలా మంది భయపడుతున్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఉద్యోగాన్ని లాక్కోదు.. కానీ మీరు మారకపోతే ముప్పు తప్పదు. నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఏఐ అనేది మనిషికి సహాయకారిగా ఉంటుంది తప్ప పూర్తిగా భర్తీ చేయదు. అయితే, ఒకే పనిని పదేపదే చేసే ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉంది. ఉదాహరణకు డేటా ఎంట్రీ లేదా బేసిక్ రిపోర్టింగ్ వంటి పనులు ఏఐ సులభంగా చేయగలదు.

భవిష్యత్తు అంతా డొమైన్ నాలెడ్జ్, టెక్నాలజీ స్కిల్స్ రెండూ కలిపి పనిచేసే వారిదే. భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ లేదా సపోర్ట్ సిస్టమ్ మాత్రమే కాదు. ప్రపంచానికి అవసరమైన ఏఐ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఫైనాన్స్ లీడర్‌షిప్‌లో ఇండియా ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారుతోంది. ఈ మార్పును అందిపుచ్చుకున్న వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది.

66
2030 నాటికి ఉండాల్సిన కీలక నైపుణ్యాలు

స్టార్టప్స్, కన్స్యూమర్ టెక్ వంటి కొన్ని రంగాల్లో లేఆఫ్స్ లేదా ఉద్యోగాల కోత కొనసాగవచ్చు. కానీ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, కంప్లయన్స్ వంటి విభాగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జెన్ జీ (Gen Z) ఉద్యోగులు తరచూ జాబ్స్ మారుతున్నారని అంటుంటారు. అయితే వారు కేవలం జీతం కోసం మాత్రమే కాదు, నేర్చుకోవడానికి అవకాశం, స్పష్టమైన గ్రోత్, ఫ్లెక్సిబిలిటీ ఉన్న చోట నిలదొక్కుకుంటున్నారు.

2030 నాటికి లేదా భవిష్యత్తులో ఉద్యోగంలో రాణించాలంటే.. ఏఐ, డేటాపై అవగాహన ఉండాలి. అంటే డేటాను అర్థం చేసుకోవడం, ఏఐ టూల్స్ వాడటంలో నైపుణ్యాలు ఉండాలి. వ్యాపార నియమాలు, పర్యావరణ, సామాజిక అంశాలపై పట్టు ఉండాలి. టెక్నాలజీని, వ్యాపార అవసరాలను సమన్వయం చేస్తూ పని చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే మొత్తంగా జాబ్ మార్కెట్ ఇప్పుడు అప్‌గ్రేడ్ కోరుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories