Today Gold Rate In Hyderabad: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్..గ్రాము ఎంత తగ్గిందో తెలుసా?

Published : Mar 12, 2026, 12:15 PM IST

Today Gold Rate In Hyderabad: బంగారం, వెండి ధరల్లో కొంతకాలంగా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. దీంతో కొనాలా? వద్దా అని కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు మదనపడుతున్నారు. ఈలోగా ధరలు క్షీణించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

PREV
15
బంగారం ధరల్లో ఊగిసలాట

దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఊగిసలాటను చూపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మార్పులు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు... ఇలాంటి అంశాలతో గోల్డ్ మార్కెట్‍పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత రిపోర్టుల ప్రకారం చూసుకుంటే...మార్చి 12న బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి.

25
క్షీణించిన గోల్డ్, సిల్వర్ ధరలు

అయితే రెండురోజులుగా గోల్డ్ రేట్లు పెరిగి ఆందోళన కలిగించాయి. కొనాలా వద్దా అని కొనుగోలుదారులు కంగారు పడ్డారు. ఇవాళ మాత్రం కాస్త ఊరట కల్గించింది. మేలిమి బంగారంపై రూ.1,090 తగ్గింది. సిల్వర్ ధర కూడా బాగానే క్షీణించింది.

35
హైదరాబాద్‍లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడిపై 10 గ్రాములకు రూ.వెయ్యి తగ్గి రూ.1,48,700 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.810 తగ్గి రూ.1,21,670కు పడిపోయింది.

ఇక వెండిలో అయితే రెండురోజుల భారీ తగ్గుదలే కనిపించింది. కిలో సిల్వర్‍పై రూ.10 వేలు తగ్గడంతో ప్రస్తుతం రూ.2.90లక్షల వద్ద కొనసాగుతోంది.

45
సేఫ్ ఆప్షన్‍గా పుత్తడి

బంగారం, వెండి ధరలెప్పుడూ ఒకే కారణంతో పెరగవు. అనేక అంతర్జాతీయ, ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటాయి. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న పరిస్థితులే ధరల మార్పులకు కారణమవుతోంది. ఇటు పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ ఆప్షన్‍గా భావించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెరగడం కామనే.

55
ఇరాన్ యుద్ధ ప్రభావం, డాలర్ మార్పులతో ధరలపై ఒత్తిడి

ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా జరగడంతో అక్కడి పరిస్థితులు మార్కెట్‍పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ బలపడటం వల్ల కూడా ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇప్పుడు మాత్రం డాలం బలపడినా కూడా కొంతమేర తగ్గింది. అయితే కొనుగోలు చేసేవారు మార్కెట్ గమనించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories