Amazon: వంద రూపాయ‌లుంటే చాలు.. అమెజాన్‌లో ఇంట్లోకి ప‌నికొచ్చే వ‌స్తువులు కొనొచ్చు

Published : Sep 26, 2025, 11:27 AM IST

Amazon: ప్ర‌స్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ నడుస్తోంది. అయితే చాలా వ‌ర‌కు మ‌న దృష్టి పెద్ద పెద్ద ప్రొడ‌క్ట్స్‌పై ప‌డుతుంది. కానీ రూ. 100ల్లో కూడా అదిరిపోయే వ‌స్తువులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేయండి. 

PREV
16
రూ. 100కే

రూ. 100తో ఏం వ‌స్తుంది అనుకునే రోజులివి. కానీ ఇదే వంద రూపాయ‌ల‌కు అమెజాన్‌లో మంచి మంచి ప్రొడ‌క్ట్స్ ఉన్నాయి. ప్ర‌స్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌లో భాగంగా కొన్ని ప్రొడ‌క్ట్స్‌పై డిస్కౌంట్స్‌తో మ‌రింత త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. మ‌రి అమెజాన్‌లో కేవ‌లం రూ. 100ల్లో ఇంట్లోకి ప‌నికొచ్చే కొన్ని బెస్ట్ ప్రొడ‌క్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

26
ప్లాస్టిక్ వెజిటేబుల్ క‌ట‌ర్

డ్రై ఫ్రూట్స్, ఉల్లిపాయ, దోసకాయ, అరటి, అల్లం, మిరపకాయలు, మృదువైన కూరగాయలను క‌ట్ చేసేందుకు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ధ‌ర కేవ‌లం రూ. 79కి అందుబాటులో ఉంది. సులభంగా పట్టుకునే స్టర్డి హోల్డర్, కటింగ్ మందం మార్చుకోవడానికి రొటరీ బట‌న్‌ను ఇచ్చారు. స్టడీ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్ పదునుగా ఉంటుంది, ఎక్కువకాలం మన్నుతుంది. ప్యాకేజీలో 1 పీస్ కంటైనర్, 1 పీస్ హోల్డర్, 1 పీస్ పుషర్ ఉంది.

36
వాల్ ఫోన్ హోల్డర్

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ స్టాండ్ పేరుతో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడ‌క్ట్ ధ‌ర కేవ‌లం రూ. 119 మాత్ర‌మే. ఫోన్ ఛార్జింగ్ పెట్టే స‌మ‌యంలో ఈ ప్రొడ‌క్ట్ బాగా ఉప‌యోగ‌పడుతుంది. ఇది అన్ని ర‌కాల స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కి సరిపోతుంది. ఫోన్లు ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు సురక్షితమైన స్టాండ్‌గా ఉపయోగించుకోవచ్చు. లైమ్ వాల్, టైల్స్, స్టెయిన్‌లెస్ స్టీల్, గ్లాస్, వుడ్, మెటల్, వాల్‌పేపర్ ఉన్న గోడలపై ఉపయోగించవచ్చు. మొబైల్ ఛార్జింగ్ వాల్ మౌంట్, AC/TV రిమోట్ స్టోరేజ్ బాక్స్, ఆర్గనైజర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. వెనుక భాగంలో హై పవర్ సెల్ఫ్ అడ్హీసివ్ ఇచ్చారు. దీంతో ఇన్‌స్టాలేషన్ చాలా సులభం.

46
3డీ గ్యాల‌క్సీ క్రిస్ట‌ల్ బాల్ నైట్ లైట్

రూ. 100ల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రొడక్ట్స్‌లో ఇదీ ఒక‌టి. కేవ‌లం రూ. 99కి ల‌భిస్తోంది. ఈ 3D ప్లానెట్ క్రిస్టల్ బాల్‌ను క్రిస్టల్‌తో తయారు చేస్తారు. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. సోలార్ సిస్టమ్ LED నైట్ లైట్ బెడ్‌రూమ్, హాల్, స్టడీ రూమ్, ఆఫీస్, ముఖ్యంగా పిల్లల గదికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్రిస్టల్ బాల్‌లో 3D లేజర్ ఎంగ్రేవింగ్ టెక్నాలజీ వాడారు. ప్లానెట్స్‌ రూపం త్రీ-డైమెన్షనల్‌గా, క్లియర్‌గా కనిపిస్తుంది.

56
3 పిన్ ట్రావ‌ల్ అడ‌ప్ట‌ర్

ఎక్కువ‌గా ట్రావెల్ చేసే వారికి ఈ అడ‌ప్ట‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. వివిధ రకాల డివైస్‌లతో పనిచేయడానికి డిజైన్ చేశారు. తేలికగా ఉండే ఈ అడాప్టర్ బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. రోజువారీ ఉపయోగానికి, ప్రయాణాలకు బాగా సరిపోతుంది. పవర్ సోర్స్‌తో స్టేబుల్ కనెక్షన్ ఇస్తుంది. అడాప్టర్ పవర్ రిసీవ్ అవుతున్నప్పుడు చూపించే లైట్ ఇండికేటర్ ఉంటుంది. అమెజాన్‌లో ఈ ప్రొడ‌క్ట్ రూ. 98కి ల‌భిస్తోంది.

66
యూఎస్‌బీ ఫ్యాన్

కేవ‌లం రూ. 85కి అందుబాటులో ఉన్న ఈ యూఎస్‌బీ ఫ్యాన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. USB కేబుల్, బ్యాటరీ ద్వారా దీనిని ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. 9D × 7W × 7H సెం.మీ పరిమాణంతో దీనిని డిజైన్ చేశారు. చిన్న సైజు మినీ ఫ్యాన్, ఎక్కడైనా చల్లగా ఉంచుతుంది. తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుంది. ఫ్యాన్ బ్లేడ్, బాడీ TPE మెటీరియల్‌తో తయారు చేశారు. ఇది పర్యావరణానికి అనుకూలం, మృదువుగా ఉంటుంది, గాయపడే ప్రమాదం లేదు.

గమనిక: ఇందులో పేర్కొన్న ధరలు వెబ్ సైట్ లో పేర్కొన్నవి మాత్రమే. అయితే కొనుగోలు సమయంలో డెలివరీ ఛార్జీలు అదనంగా పడుతుండొచ్చు. కాబట్టి ఇతర వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ఇలాంటివి కార్ట్ లోకి యాడ్ చేస్తే అదనపు లాభం పొందొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories