Credit Card: ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డ్స్ వాడుతూ, బిల్లులను చెల్లించలేక చాలా మంది అప్పుల ఊబిలో పడుతున్నారు. ఈ బిల్లులను తిరిగి చెల్లించలేకపోవడంతో క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించండి.
Credit card: ఈ మధ్యకాలంలో చాలా మంది షాపింగ్, బిల్లు చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, ఈ అలవాటు ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారుతోంది. CRIFహైమార్క్ నివేదిక ప్రకారం 2024 మార్చిలో రూ. 23,475 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ బకాయిలు ఒక్క ఏడాదిలో రూ. 10,410 కోట్లు పెరిగి రూ. 33,866 కోట్లకు చేరుకున్నాయి. వీటిలో అధికంగా 91 నుంచి 180 రోజులుగా చెల్లించని బిల్లులే. వీటినే బ్యాడ్ లోన్ (NPA) పరిగణించబడతాయి.
ఇలా చిన్న చిన్న అవసరాలకు క్రెడిట్ కార్డులు వాడుతూ, బిల్లులను చెల్లించలేక అప్పుల ఊబిలో పడుతున్నారు. చెల్లింపుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అది భవిష్యత్‌లో ఆర్థిక భారం, క్రెడిట్ స్కోర్ నష్టానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించండి.
26
1. సకాలంలో బిల్లులు చెల్లింపు
క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం తప్పనిసరి. పర్సనల్ లోన్ EMI చెల్లింపు లేదా క్రెడిట్ కార్డ్ బిల్ సకాలంలో చెల్లించకపోతే అధిక వడ్డీ ఛార్జీలు విధించబడతాయి. అలాగే.. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, పెండింగ్ బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించి, మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ను మెరుగుపరచవచ్చు.
36
2. పరిమితంగా వినియోగించండి
మీ క్రెడిట్ కార్డ్ పరిమితి ఎంత ఉన్నా, దానిలో 30 శాతం కంటే ఎక్కువ వినియోగించకుండా జాగ్రత్త పడండి. దీని అర్థం కార్డును పరిమితంగా ఉపయోగించండి. ఉదాహరణకు, మీరు రూ. 1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంటే.. అందులో రూ. 30,000 లోపు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. ఇది మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడటానికి దోహదపడుతుంది.
మీరు మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను ప్రతిరోజూ పర్యవేక్షించండి. ఎంత ఖర్చవుతోంది, ఎక్కడ ఖర్చవుతోంది అనే వివరాలు స్పష్టంగా తెలుసుకోండి. అలాగే ఖర్చులపై కూడా ఓ పరిమితిని నిర్ణయించుకోండి. తద్వారా మీరు అధిక వడ్డీ భారం లేదా రుణ భారం రెండూ తగ్గుతాయి.
56
4. నిబంధనలపై అవగాహన
క్రెడిట్ కార్డ్ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రధాన వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ రేట్లు, లేటీ ఫీజులు, బిల్లింగ్ మొదలైన విషయాలను అర్థం చేసుకోవాలి. ఏదైనా సందేహం ఉంటే.. తక్షణమే మీ బ్యాంక్ లేదా కార్డ్ జారీ సంస్థను సంప్రదించండి. ఇది అనవసర ఖర్చులను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. అలాగే వారు అందించే సూచనలు ఉపయోగపడుతాయి.
66
5. సామర్థ్యాన్ని బట్టి ఖర్చు
క్రెడిట్ కార్డుపై లిమిట్ వరకు ఖర్చు చేయవచ్చు. కానీ, మీరు తిరిగి చెల్లించే సామర్థ్యం మన దగ్గర ఉందా? లేదా? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి.ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో మొత్తం బ్యాలెన్స్‌ను చెల్లించడం వలన, వడ్డీ ఖర్చులు లేకుండా మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. ఇది ఒక మంచి ఫైనాన్షియల్ అలవాటు.