అమెరికా మార్కెట్ పతనంతో దీన్ని మరో బ్లాక్ మండేగా చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో అమ్మకాల తర్వాత వాల్ స్ట్రీట్‌లో పెద్ద పతనం కనిపించింది. ఇప్పుడు మన మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. ఇది ఒక్క రోజుతో ఆగుతుందా లేదా చూడాలి. మన మార్కెట్ అమెరికా మీద ఆధారపడి లేదు. అందుకే త్వరగా మంచి స్థితికి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం సెన్సెక్స్ 3000 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పడిపోయాయి.
డవ్ ఫ్యూచర్స్ ఆదివారం సాయంత్రం 1,600 పాయింట్లు పడిపోవడంతో, దాని ప్రభావం ఇక్కడ కూడా ఉండొచ్చు. శుక్రవారం నిఫ్టీ 350 పాయింట్లు పడిపోయి 23,000 దిగువకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు పడిపోయింది. చైనా మీద 34%, ఇండియా మీద 26%, యూరోపియన్ యూనియన్ మీద 20% పన్నును ట్రంప్ వేశారు. ఇది అమెరికా, ప్రపంచ ఆర్థిక మార్కెట్లను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల అమెరికా షేర్ల విలువలో దాదాపు 6 ట్రిలియన్ డాలర్లు నష్టం వచ్చింది.