ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది కొన్న బైక్ ఇది. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మళ్లీ వచ్చేస్తోంది

హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్+.. ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడయ్యే నంబర్ వన్ బైక్. ఇది ఎంత స్పెషల్ అంటే.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా జనం కొన్నారు. ఇప్పుడు కొత్త అప్‌డేట్స్ తో మార్కెట్ ను షేక్ చేయడానికి వచ్చేస్తోంది. ఈ కొత్త బైక్ ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందామా? 

Hero Splendor Plus 2025 Launch Details and Updates in telugu sns
Hero Splendor Plus

హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో తిరుగులేని బైక్. ఎందుకంటే ఇది రెండు దశాబ్దాలకు పైగా ఇండియాలో అమ్మకాల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. దీనికి కారణం అన్ని వర్గాల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. ఇతర కంపెనీల బైక్ ధరలు పెరిగిపోతుంటే హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్, స్ప్లెండర్ ప్లస్ బైక్స్ మాత్రం పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే ఉంటున్నాయి.  

Hero Splendor Plus 2025 Launch Details and Updates in telugu sns

ఇప్పడు హీరో స్ప్లెండర్+ లేటెస్ట్ అప్ డేట్స్ తో మళ్లీ మార్కెట్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. కొత్త అప్ డేట్స్ గురించి తెలిసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

హీరో స్ప్లెండర్+ బైక్ OBD-2B ప్రమాణాలకు తగ్గట్టుగా అప్‌డేట్ అవుతోంది. భారత్ స్టేజ్ 6 (BS6) ఫేజ్ 2 ఉద్గార నియమాలలో భాగంగా OBD-2B కింద, వాహనాలు ఉద్గారాలను పర్యవేక్షించాలి. అంటే వెహికల్ ఇంజిన్ నుండి వెలువడే పొగ, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనో ఆక్సైడ్, ఇతర కాలుష్యకర వాయువులను BS6 నియమాలకు అనుగుణంగా విడుదల చేస్తుంది. అంతే కాకుండా ఆక్సిజన్ సెన్సార్లు, ఇంజిన్ సిస్టమ్ వంటి భాగాలు ఎప్పుడూ అబ్జర్వేషన్ లో ఉంటాయి. 


హోండా, టీవీఎస్ ఇప్పటికే OBD-2B ఉద్గార నియమాలకు అనుగుణంగా టూ వీలర్లను అప్‌డేట్ చేశాయి. ఇప్పుడు స్ప్లెండర్+ కూడా ఈ జాబితాలో చేరుతోంది. 

హీరో స్ప్లెండర్+ కొత్త ఫీచర్లు?

స్ప్లెండర్+ బైక్ లో పనితీరులో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. 97.2 సిసి, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో హీరో స్ప్లెండర్+ 8.02 PS, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్‌కు హార్డ్‌వేర్ మారదు. ట్యూబ్యులర్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌ను ఇందులో ఉపయోగించారు. రెండు చివర్లలో 18 అంగుళాల చక్రాలు 80/100 ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తాయి.

బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు, వెనుక 130 మి.మీ. డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. బైక్ 112 కిలోల బరువు, 165 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

2025 Hero Splendor Plus

స్ప్లెండర్+ రకాలు, రంగులు, ధర

హీరో స్ప్లెండర్+ బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.77,176. ఇది నలుపు, ఫోర్స్ సిల్వర్, స్పోర్ట్స్ రెడ్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి.

ఇది కూడా చదవండి సమ్మర్‌లో కారు టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Latest Videos

vuukle one pixel image
click me!