ఎలక్ట్రిక్ వెహికల్స్ దిశగా టాటా కంపెనీ
రాబోయే టాటా నానో పెట్రోల్ ఇంజిన్‌లను వాడదు. పెట్రోల్‌తో నడిచే దాని పాత మోడల్ కాకుండా, కొత్త నానో పూర్తిగా ఎలక్ట్రిక్‌గా ఉంటుంది. దేశంలో ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ ట్రెండ్‌కు తగ్గట్టుగా టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని పెంచుతోంది. అందులో భాగంగానే నానో కారును కూడా ఈవీగా మార్చి రిలీజ్ చేయనుంది. ఈ కారు మార్కెట్ లోకి వస్తే స్టార్టింగ్ లెవెల్ ఈవీ సెగ్మెంట్‌లో ఇదే బెస్ట్ కారు అవుతుంది.
టాటా ఇప్పటికే టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ లాంటి పాపులర్ ఎలక్ట్రిక్ మోడల్స్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్టులో నానో ఈవీ కూడా చేరింది. బేసిక్ ఇంకా ఎఫిషియంట్ సిటీ డ్రైవింగ్ కోసం చూసే కస్టమర్స్‌కి ఇది బాగా సూట్ అవుతుంది.