దేశంలో అత్య‌ధిక ఆదాయం తెచ్చే రైలు ఏదో తెలుసా.? ఏడాది సంపాద తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Nov 20, 2026, 01:43 PM IST

Indian Railway: భారతీయ రైల్వేలో వందేభారత్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేగం, సౌకర్యాల విషయంలో ఈ రైళ్లు ముందుంటాయి. అయితే అత్యధిక ఆదాయం తెచ్చే రైలు మాత్రం వీటిలో ఏదీ కాదని తెలుసా.?

PREV
15
భారతీయ రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు ఏది?

భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశంలోని నాలుగు దిశలను కలుపుతూ భారతీయ రైల్వే విస్తృతమైన రైలు నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లు కూడా రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. రైల్వే ఆదాయంలో ప్రయాణికుల టికెట్లతో పాటు సరుకు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలపై రైల్వే రాయితీలు కూడా కల్పిస్తోంది. ప్రయాణికుల వివిధ కేటగిరీలకు అందించే రాయితీల కారణంగా రైల్వేపై భారీ ఆర్థిక భారం పడుతోంది.

25
వందేభారత్, శతాబ్ది రైళ్లు ఎందుకు వెనుకబడ్డాయి?

వందేభారత్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగం, ఆధునిక సౌకర్యాలు, ప్రయాణ అనుభవం విషయంలో ప్రత్యేకమైనవి. వీటికి ప్రయాణికుల్లో మంచి ఆదరణ కూడా ఉంది. అయితే ఒక రైలు ఎంత ఆదాయం సంపాదించిందనే విషయంలో ప్రయాణికుల సంఖ్య, ప్రయాణ దూరం, టికెట్ ధరలు వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ఈ విషయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ముందున్నాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలను కలిపే రాజధాని రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే ఇవి భారతీయ రైల్వే ఆదాయంలో గణనీయమైన వాటాను అందిస్తున్నాయి

35
అత్యధిక ఆదాయం తెచ్చిన కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్

దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన రైళ్లలో కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఈ రైలు ఢిల్లీ నుంచి బెంగళూరును కలుపుతుంది. సుదూర ప్రయాణం చేసే వారికి వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు ఏకంగా రూ.1,760.67 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ గణాంకాలు చూస్తే ఒకే రైలు ద్వారా భారతీయ రైల్వేకు ఎంత భారీ ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

45
ఏడాదిలో 5 లక్షలకు పైగా ప్రయాణికులు

కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయంలో ప్రయాణికుల సంఖ్య కూడా కీలక పాత్ర పోషించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు సిటీ జంక్షన్ మధ్య ఈ రైలు సేవలు అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు ద్వారా మొత్తం 5,09,510 మంది ప్రయాణించారు. అంటే ఏడాది వ్యవధిలో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయం ఈ రైలును దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన రైళ్లలో ఒకటిగా నిలిపింది.

55
ఆదాయంలో ఇతర రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లదీ కీలక పాత్ర

కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా భారతీయ రైల్వే ఆదాయానికి గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. ప్రధాన నగరాలను దేశ రాజధాని ఢిల్లీతో కలుపుతూ ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్, టికెట్ ధరలు, ప్రయాణ దూరం వంటి అంశాల ఆధారంగా ఈ రైళ్ల ఆదాయం మారుతూ ఉంటుంది. మొత్తానికి వందేభారత్, శతాబ్ది వంటి ఆధునిక రైళ్లే అత్యధిక ఆదాయం తెస్తాయని చాలామంది భావించినప్పటికీ.. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆదాయంలో తమ సత్తా చాటుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories