ప్రస్తుతం మనం వాడుతున్న కాగితం నోట్లు కాటన్ ఆధారిత మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ ఈ ప్లాస్టిక్ నోట్లను బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొపీలీన్ అనే ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్‌తో తయారు చేస్తారు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి..
• ఎక్కువ కాలం మన్నిక: సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.
• పాడైపోవు: ఇవి నీటిలో తడిచినా, నలిగినా, మురికి అంటినా లేదా చిరిగిపోయినా ఏమీ కావు.
• తక్కువ ఖర్చు: నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల ప్రతీ ఏటా కొత్త నోట్లను ప్రింట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల ప్రింటింగ్, రవాణా ఖర్చులు బాగా ఆదా అవుతాయి.
• నకిలీ నోట్లకు చెక్: ప్లాస్టిక్ నోట్లలో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లు తెస్తారు. సీ-త్రూ విండోస్, హోలోగ్రామ్స్, చూపు లేని వారి కోసం ప్రత్యేక మార్కింగ్స్ వంటివి చేర్చవచ్చు. దీనివల్ల నకిలీ నోట్లను తయారు చేయడం అసాధ్యం.