భారత సంతతికి చెందిన అమెరికన్ అయిన సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుమారు 9 నెలలకు పైగా ఉండిపోయారు. కేవలం 5 పర్యటనకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) అనేది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతుంటుంది. ఇది ఒక విశ్వంలో ఉండే రహస్యాలను కనుగొనడానికి నిరంతరం ప్రయత్నించే అద్భుతమైన ప్రయోగశాల. ఇది భూమి చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంటుంది. భూమి చుట్టూ ఇది ఒక రౌండ్ వేయడానికి కేవలం 90 నిమిషాలు పడుతుంది.
అందువల్లనే ISSలో ఉన్న సునీతా విలియమ్స్ రోజుకు సుమారు 16 సార్లు భూమి చుట్టూ తిరిగే వారు. ఈ క్రమంలో అనేక దేశాల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ స్థితిగతులపై అధ్యయనం చేసేవారు. అందులో భాగంగానే భారతదేశానికి చెందిన ఎన్నో విషయాలపై ప్రయోగాలు చేసేవారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటూ భారతదేశం గురించి ఎలాంటి విషయాలు తెలుసుకున్నారో సునీతా విలియమ్స్ చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాలయాల గురించి సునీతా విలియమ్స్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతిసారి వాటిని దాటినపుడు ఫోటోలు తీసేవారమని ఆమె చెప్పారు. గుజరాత్, ముంబై వైపు వెళ్తున్నపుడు తీరం వెంబడి లైట్ హౌస్ లాగా పడవలు కనిపిస్తాయని ఆమె అన్నారు.
భారతదేశం దీపాల వలలా ఉంటుందని ఆమె అభివర్ణించారు. పెద్ద నగరాలు, చిన్న నగరాలు అంతరిక్షం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తాయని అన్నారు.
సునీతా విలియమ్స్ పెద్దలు గుజరాత్‌లోని జులాసన్ గ్రామానికి చెందిన వారు. ఐఎస్ఎస్ ద్వారా గుజరాత్ మీదుగా వెళుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించేదని తెలిపారు. అందుకే భూమికి తిరిగి వచ్చాక ఒక సారి ఇండియా వెళ్లాలని, ప్రత్యేకంగా తన స్వగ్రామానికి వెళ్లాలని అనుకున్నానని చెప్పారు. త్వరలోనే తాను ఇండియా రావడానికి ప్లాన్ చేసుకుంటానని ప్రకటించారు.
సునీతా విలియమ్స్ గత ఏడాది జూన్ నెలలో ఆమె అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యల వల్ల ఆమె తిరిగి రావడం తీవ్ర ఆలస్యమైంది. ఎట్టకేలకు ఆమె భూమికి తిరిగి రావడం, ల్యాండింగ్ సజావుగా సాగడంతో ఇండియాలో, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని ఆమె పూర్వీకుల స్వగ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి Earth: భూమి ఎంతమంది మనుషులను మోయగలదు?