లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్
ఇండియలో చాలా అందమైన సిటీస్ లో లద్దాఖ్ ఒకటి. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. హిమాలయాలకు పడమర వైపు ఉంటుంది. పిల్లలతో కలిసి వెళ్తే ప్రకృతి అందాలు మిమ్మల్ని మైమరపింపజేస్తాయి.
మనాలి, హిమాచల్ ప్రదేశ్
సమ్మర్ లో వెళ్లడానికి మనాలి బెస్ట్. ఎందుకంటే పచ్చని లోయలు, మంచు కొండల మధ్య ఇక్కడ మీరు పారాగ్లైడింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్ లాంటివి చాలా సాహసోపేతమైన పనులు చేయొచ్చు.
కాశ్మీర్ (శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్)
దీన్ని 'భూమి మీద స్వర్గం' అని కూడా అంటారు. కాశ్మీర్ ప్రాంతం కొండలకు, అందమైన సరస్సులకు ఫేమస్. చల్లని మంచు కొండలు, గలగలపారే నదులు మిమ్మల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లని అనుభూతిని ఇస్తాయి.
నైనిటాల్, ఉత్తరాఖండ్
ఇది ఒక హిల్ స్టేషన్. ఇది నైని అనే సరస్సు దగ్గర ఉంది. చుట్టూ కొండలు ఉంటాయి. సమ్మర్ లో వెళ్లడానికి ఇది సూపర్ ప్లేస్. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఊటీ, తమిళనాడు
'ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్' అని పిలుచుకునే ఊటీ ఇండియాకు ప్రత్యేక ఆకర్షణ. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. వేసవిలో మీకు చల్లదనం కావాలంటే ఊటీ బెస్ట్ ప్లేస్. ఇక్కడ మంచి లేక్స్, పచ్చని చెట్లు ఎంత చూసినా తనివి తీరవు.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
టీ తోటల్లో తిరుగుతూ, హిమాలయాల అందాలను ఎంజాయ్ చేయాలనుకొనే వారికి డార్జిలింగ్ బెస్ట్ ప్లేస్. కొత్తగా పెళ్లయిన యువ జంట హనీమూన్ ట్రిప్ గా ఇక్కడ వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ లో చూడటానికి ఇది బెస్ట్ ప్లేస్.
ఔలి, ఉత్తరాఖండ్
మీరు స్కీయింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఔలి బెస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి హిమాలయాలు బాగా కనిపిస్తాయి. ఇది ట్రెకింగ్, క్యాంపింగ్ చేసేవాళ్లకి సూపర్ ప్లేస్.
రిషికేష్, ఉత్తరాఖండ్
దీన్ని 'యోగా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్' అని అంటారు. రిషికేష్ ఒక స్పిరిట్యువల్ ప్లేస్. ఇక్కడ వైట్ వాటర్ రాఫ్టింగ్ లాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ చాలా మంది ధ్యానులు, తప్పసు చేసుకొనే వారు కనిపిస్తారు.
గ్యాంగ్టక్, సిక్కిం
సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ నుంచి కంచన్ గంగా రేంజ్ బాగా కనిపిస్తుంది. అందుకే సమ్మర్ లో వెళ్లడానికి ఈ ప్లేస్ బాగుంటుంది.
కూర్గ్, కర్ణాటక
దీన్ని 'భారత్ స్కాట్లాండ్' అని కూడా అంటారు. కూర్గ్ కాఫీ తోటలతో పాటు పొగమంచు కొండలకు ఫేమస్. ఇక్కడకు వెళితే మేఘాల్లో తేలుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సమ్మర్ లో అయితే ాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇది కూడా చదవండి మంచు ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి తప్పనిసరి