Travel
2022లో ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటిపోయింది. 2070-80 నాటికి భూమిపై మానవుల జనాభా 9.4 నుంచి 10.4 బిలియన్లకు చేరుకోవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
గణిత, భౌతిక శాస్త్రాల ఆధారంపై భూమిపై గరిష్టంగా ఎంతమంది ఉండగలరో కనిపెట్టొచ్చు.
భూమి ఉపరితల వైశాల్యం సుమారు 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. కాని భూమి వైశాల్యం సుమారు 148 మిలియన్ చదరపు కిలోమీటర్లు మాత్రమే.
భూమిపై ఒక వ్యక్తి నిలబడటానికి 0.2 చదరపు మీటర్లు అంటే 50cm x 40cm స్థలం కావాలి. దీని ఆధారంగా భూమిపై ఎంతమంది ఒకేసారి నిలబడగలరో తెలుసుకోవచ్చు.
భూమి వైశాల్యం 148 ట్రిలియన్ చదరపు మీటర్లు.
ఒక్కొక్కరికి 0.2 m² స్థలం తీసుకుంటే 148,000,000,000,000/0.2.
అంటే 740 ట్రిలియన్లు. అంటే 740 లక్షల కోట్లు మంది నిలబడగలరు.
22వ శతాబ్దం నాటికి భూమి జనాభా 11 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. 2012లో వచ్చిన ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం వనరుల ప్రకారం భూమి 1,024 బిలియన్ల మంది బరువును మోయగలదు.