కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది మధ్యతరగతి వారికి ఊరట కలిగించేలా రూ.12 లక్షల వరకు పైసా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరటనిస్తూ రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 12 లక్షల ఆదాయానికి రూ. 75 వేల ప్రామాణిక తగ్గింపును(స్టాండర్డ్ డిడక్షన్) కూడా కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు అసలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. అయితే ఇది అందరికి వర్తించదు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
24
ఎవరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన షరతుల ప్రకారం… రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. ఆ మొత్తానికి సెక్షన్ 87A కింద రిబేట్ వర్తిస్తుంది. అయితే ఇది వేతన జీవులకు మాత్రమే. మూలధన లాభాలు వంటి ప్రత్యేక ఆదాయం కలిగిన వారికి ఈ రిబేట్ వర్తించదు. ఈ కొత్త పన్ను శ్లాబులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) నుంచి వర్తిస్తాయి.
34
ఇంతకు ముందు పన్ను విధానం..
ఇంతకు ముందు దాదాపు రూ.7 లక్షల వరకు ఆదాయానికి మాత్రమే రిబేట్ (సెక్షన్ 87A) అందుబాటులో ఉండేది. కానీ ఇటీవలి మార్పుల వల్ల స్లాబ్‌లు, డిడక్షన్‌లు సవరించబడ్డాయి. దీని కారణంగా స్టాండర్డ్ డిడక్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఇతర మినహాయింపులు, రిబేట్ కలిపి పన్ను చెల్లించకుండా ఉండే పరిమితి రూ. 12.75 లక్షలకు చేరింది.
కొత్త పన్ను విధానం ప్రకారం.. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉంటే.. దానికి రూ. 60,000 రిబేట్ వర్తిస్తుంది. అయితే, సెక్షన్ 111A కింద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, సెక్షన్ 112 కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆదాయాలపై సెక్షన్ 87A రిబేట్ వర్తించదు. అంటే.. మీ ఆదాయం రూ.12.75 లక్షల లోపు ఉన్నా.. స్వల్పకాలిక మూలధన లాభాలపై ప్రత్యేక పన్ను రేటును చెల్లించాల్సి ఉంటుంది.