Travel Safety Tips: ఈ 10 టిప్స్ పాటిస్తే మీ ప్రయాణం హ్యపీగా, సేఫ్ గా సాగిపోతుంది!

Published : Aug 13, 2025, 03:43 PM IST

చాలామంది రెగ్యులర్ గా ప్రయాణాలు చేస్తుంటారు. అవసరం కోసం కొందరు, సరదా కోసం మరికొందరు ప్రయాణాలు చేస్తుంటారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలి. అప్పుడే ప్రయాణం హ్యాపీగా, సేఫ్ గా ఉంటుంది. అవేంటో చూద్దాం.

PREV
16
Travel Safety Tips

ప్రపంచాన్ని చుట్టి రావడమంటే.. ఎన్నో అనుభవాలు, ఆనందాలు, కొత్త పరిచయాలు, కొత్త సంస్కృతులను ఆస్వాదించడమే. కానీ ప్రయాణం అంటే సరదా మాత్రమే కాదు.. భద్రత కూడా ముఖ్యం. డబ్బు, పత్రాలు, వ్యక్తిగత భద్రత వంటి విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. మీ నెక్ట్స్ ప్రయాణం సురక్షితంగా సాగడానికి అవసరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి తెలుసుకోండి.

26
ముందస్తు ప్రణాళిక

ప్రయాణానికి ముందు మీరు వెళ్లబోయే ప్రాంతం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. అక్కడి వాతావరణం, సంస్కృతి, భద్రతా పరిస్థితి, స్థానిక చట్టాలు, అత్యవసర నెంబర్ల వంటివి వాటి గురించి తెలుసుకోవాలి. వీటిని తెలుసుకోవడం వల్ల అనుకోని ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోవాలి

పాస్‌పోర్ట్, ఐడెంటిటీ కార్డ్, టికెట్లు, బుకింగ్ డాక్యుమెంట్స్ వంటి వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. వీటి డిజిటల్ కాపీలు గూగుల్ డ్రైవ్/ఇమెయిల్‌లో సేవ్ చేసుకోవడం మంచిది. ఒక ఫిజికల్ కాపీ కూడా వేరే బ్యాగ్‌లో ఉంచుకోవాలి. పాస్‌పోర్ట్‌ను హోటల్ లాకర్‌లో ఉంచండి. ప్రయాణంలో ఫోటో కాపీ మాత్రమే తీసుకెళ్లండి.

36
డబ్బు, కార్డుల వినియోగంలో జాగ్రత్త

అన్ని డబ్బులను ఒకేచోట ఉంచకూడదు. కొంత మొత్తాన్ని బ్యాగ్ లో విడిగా పెట్టుకోవడం మంచిది. డెబిట్/క్రెడిట్ కార్డులు ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మదగిన ప్రాంతాల్లో మాత్రమే ATM ను వాడాలి. చిన్న మొత్తంలో క్యాష్ తీసుకెళ్లడం మంచిది. 

పబ్లిక్ వై-ఫై వాడేటప్పుడు జాగ్రత్త

ఉచిత Wi-Fi వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎంటర్ చేయకపోవడమే మంచిది. VPN (Virtual Private Network) ఉపయోగించడం ఉత్తమం.

46
స్థానికులతో జాగ్రత్త

మనం వెళ్లిన చోట ఎవరడిగినా మన పూర్తి ప్రయాణ వివరాలు చెప్పకూడదు. కొత్తగా పరిచయమైన వ్యక్తులను వెంటనే నమ్మకూడదు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి దూరంగా ఉండడమే మంచిది.

హోటల్ భద్రత

మీరు సెలెక్ట్ చేసుకున్న హోటల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. హోటల్ రివ్యూలు చదివి బుక్ చేసుకోవడం మంచిది. హోటల్ లోపల డోర్ లాక్స్, విండో లాక్స్ పనిచేస్తున్నాయో చెక్ చేసుకోవాలి. రాత్రివేళ ఎక్కువగా బయట తిరగకపోవడమే మంచిది.

56
వ్యక్తిగత భద్రతా పరికరాలు

పెప్పర్ స్ప్రే వంటి స్వీయ రక్షణ పరికరాలను మీతోపాటు తీసుకెళ్లండి. సెల్‌ఫోన్‌లో GPS, లైవ్ లొకేషన్ ఆన్ చేసి ఉంచుకోవాలి.

ప్రయాణ బీమా తప్పనిసరి

ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు, బ్యాగేజ్ నష్టాలు, విమాన రద్దులు వంటి విషయాలకు ప్రయాణ బీమా ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఒక భద్రతా కవచం లాంటిది.

66
ఆరోగ్యంపై శ్రద్ధ

మీరు వెళ్లిన ప్రాంత వాతావరణానికి తగినట్లు దుస్తులు వేసుకోవడం మంచిది. శుభ్రమైన ఆహారం, శుద్ధమైన నీటిని ఉపయోగించండి. అవసరమైన మెడిసిన్‌లు, ప్రథమ చికిత్స కిట్ వెంట తీసుకెళ్లండి.

ప్రయాణ వివరాలు చెప్పడం 

కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు మీ ప్రయాణ వివరాలు, లొకేషన్, స్టే చేసే ప్రదేశాల గురించి తెలియజేయండి. రోజువారీ అప్డేట్ పంపించడం మర్చిపోవద్దు.  

ఫైనల్ గా

ప్రపంచాన్ని చూడాలనేదే ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కల సురక్షితంగా సాగాలంటే భద్రతాపరమైన చిట్కాలు పాటించడం చాలా అవసరం. నిర్లక్ష్యంగా ఉంటే ఊహించని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories