ఆసియాలోని ధనవంతుల కుటుంబంగా అంబానీ కుటుంబం పేరు తెచ్చుకుంది. తాజాగా చేసిన సర్వేలో ఇదే కుటుంబం భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. వారి ఆస్తి గతేడాదితో పోలిస్తే మరో 10 శాతం పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సంపదను అమాంతం పెంచుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే పది శాతం ఆస్తులు పెరిగాయి. హురూన్ అనే నివేదిక ప్రకారం మన దేశంలో బిలియనీర్ల ఆస్తులపై సర్వేలు జరిగాయి. ఎవరికి ఎంత ఆస్తి ఉందో హురూన్ నివేదిక వెల్లడించింది. అందులో అంబానీ కుటుంబం దగ్గరే 2025లో 28 లక్షల కోట్ల రూపాయల ఉందని తేలింది. గతేడాదితో పోలిస్తే పది శాతం వారి ఆస్తులు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ధనిక కుటుంబం అదానీ. అదానీ ఆస్తుల విలువ 14 లక్షల కోట్లు అంటే.. అంబానీ ఆస్తుల్లో సగమే. అంబానీ స్థాయికి చేరాలంటే ఎవరికైనా ఇప్పట్లో అసాధ్యమైనే చెప్పాలి.
25
300 రిచెస్ట్ కుటుంబాలు
హురున్ రీసెర్చ్ ప్రకారము మనదేశంలో 300 సంపన్న కుటుంబాలు ఉన్నాయి. వీరి చేతిలోనే 140 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అంటే మన భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా 40 ఇక అంబానీ కుటుంబం మాత్రమే 12 శాతం జీడీపీని కలిగి ఉంది. అంబానీ కుటుంబం మన భారతదేశంలో సగం భూమిని కొనేశాంత ఆస్తిని కూడా పెట్టింది.
అంబానీ కుటుంబంలో విపరీతంగా లాభాలు రావడానికి వారి కృషి ఫలితమే. సంపదలో వారికి ప్రతి ఏడాది నిరంతర వృద్ధి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే వారి సంపద 10 శాతం పెరిగింది. టెలికాం, రిటైల్, పెట్రోలియం ఉత్పత్తులు ఇలా అనేక రంగాలలో మీరు పెట్టబడులు పెట్టి విపరీతమైన లాభాలను ఆర్జిస్టున్నారు. అంబానీ, అదానీ తరువాత కొన్ని సంపన్న కుటుంబాలు ఉన్నాయి.
35
అంబానీ, అదానీ తరువాత ఎవరు?
అంబానీ, అదానీ తర్వాత మూడో స్థానంలో కుమార్ మంగళం బిర్లా కుటుంబం నిలిచింది. వీరి ఆస్తులు విలువ 6.47 లక్షల కోట్లు. నిజానికి వీరు గత పోలిస్తే 20 శాతం వృద్ధిని సాధించారు. అయినా కూడా అంబానీ ఆస్తుల్లో మూడోవంతునే కలిగి ఉన్నారు.
ఆ తర్వాత జిందాల్ కుటుంబం 5.70 లక్షల కోట్ల రూపాయల నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానంలో 5.6 లక్షల కోట్ల రూపాయలతో బజాజ్ కుటుంబం స్థానం సంపాదించింది. కొన్ని కుటుంబాలు వేగంగానే అభివృద్ధి చెందుతున్నాయి. మరికొన్ని కుటుంబాలను వ్యాపారాల్లో నష్టం, మార్కెట్ నుంచి వచ్చే సవాళ్ల వల్ల వెనుకబడిపోయాయి.
45
హురున్ నివేదిక అంటే ఏమిటి?
హురూన్ ఇండియా ప్రతి ఏడాది పరిశోధనలు చేసి నివేదికలు అందిస్తుంది. ఈ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాను ఇది విడుదల చేస్తుంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు, సంపద పెరుగుదల, క్షీణత వంటివి లెక్కించేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది. 2025లో ఏ కుటుంబాలు అయితే ఎనర్జీ, టెలికాం, ఐటి, రిటైల్ రంగాల్లో ఉన్నాయో వారే సంపన్న కుటుంబాలుగా నిలిచాయి.
55
అంబానీని చేరుకోవడం కష్టమే
కొన్ని సంవత్సరాలుగా ఆసియా అలాగే మనదేశంలో అత్యంత ధనిక కుటుంబంగా అంబానీ కుటుంబమే మొదటి స్థానంలో నిలుస్తోంది. రిలయన్స్... మొదట వస్త్ర వ్యాపారంతో మొదలైంది. ఆ తర్వాతే పెట్రో కెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం ఇలా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే వీరు సంపన్న వ్యాపారవేత్తలుగా మారారు. తండ్రి మరణం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ముఖేష్ అంబానీ తీసుకున్నారు. ఇక ఇతర వ్యాపారాలను అనిల్ అంబానీకి అప్పగించారు. ముఖేష్ అంబానీ తాను తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఆయన కృషి పట్టుదలతో ఎదిగేలా చేశారు. అనేక శాఖలుగా, ఉప శాఖలుగా పెంచుకుంటూ వెళ్లారు. అనేక ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అవన్నీ కలిసి వచ్చి ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు.