UPI Payments: యూపీఐ వినియోగదారులకు ఐసీఐసీఐ షాక్ ఇచ్చింది. ఆగస్టు 1, 2025 నుండి ICICI బ్యాంక్ ప్రతి UPI లావాదేవీపై చెల్లింపు అగ్రిగేటర్లకు (PAలు) 0.02% ఛార్జ్ వసూలు చేయనుంది. ఇప్పటికే యాక్సిస్, యస్ బ్యాంకులు ఇదే విధంగా ఛార్జ్ చేస్తున్నాయి.
UPI Transaction Charges: మీరు UPI చెల్లింపులు చేస్తుంటే.. ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ICICI బ్యాంక్ UPI వినియోగదారులకు షాక్ ఇచ్చింది. డిజిటల్ లావాదేవీలపై కొత్త నియమాన్ని అమలు చేయబోతోంది. ఈ నిబంధన 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం చెల్లింపు అగ్రిగేటర్ల (PAలు) ద్వారా జరిగే UPI లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనుంది. ఛార్జీలు ఎలా ఉంటాయి? వీటి వల్ల ఎవరు ప్రభావితం అవుతారు? అనే వివరాలు మీ కోసం.
25
ఆ బ్యాంకుల బాటలో ఐసీఐసీఐ
యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ బాటలో ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా అదే దారిలో నడుస్తుంది. ఈ రెండు బ్యాంకులు ఇప్పటికే చెల్లింపు అగ్రిగేటర్ల (Payment Aggregators - PAలు) ద్వారా జరిగే UPI లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేస్తుంది. ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది. ఆగస్టు 1, 2025 నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనున్నది. ఈ నిర్ణయం డిజిటల్ చెల్లింపులపై ప్రభావం చూపనుంది. వినియోగదారులకు నేరుగా ఛార్జీలు లేకపోయినా, వ్యాపారులు భరించాల్సిన ఈ అదనపు ఛార్జీలు చివరికి కస్టమర్లకే పరోక్షంగా భారంగా మారే అవకాశం ఉంది.
35
ఎంత ఛార్జ్ వసూలు చేస్తుంది?
జూలై నెల ఆరంభంలోనే పేమెంట్ అగ్రిగేటర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. ఐసీఐసీఐలో ఎస్క్రో ఖాతాను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్ (Payment Aggregators)పై ప్రతి లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (0.02%) ఛార్జ్ వసూలు చేయనుంది. ఉదాహరణకు, రూ. 10,000 లావాదేవీపై రూ. 2 ఛార్జ్ పడుతుంది. అయితే ఒక్క లావాదేవీపై గరిష్టంగా రూ. 6 వరకు మాత్రమే ఛార్జ్ విధించబడుతుంది. ఇక, ఎస్క్రో ఖాతా లేనివారైతే.. ఈ ఛార్జీలు రెట్టింపు కానున్నాయి. అంటే.. ఎస్క్రో ఖాతా లేని PAలపై 4 బేసిస్ పాయింట్లు (0.04%), అంటే రూ. 10,000కి రూ. 4, గరిష్టంగా రూ. 10 వరకు ఛార్జ్ విధించబడుతుంది.
పేమెంట్ అగ్రిగేటర్లు అనేవి ఆన్‌లైన్ వ్యాపారులకు కస్టమర్ల నుండి డిజిటల్ చెల్లింపులను స్వీకరించడంలో సహాయపడే సంస్థలు. ఉదాహరణకు, మీరు దుకాణం లేదా ఈ-కామర్స్ సైట్‌లో UPI ద్వారా చెల్లింపు చేస్తే, ఆ చెల్లింపును PhonePe, Paytm, Razorpay వంటి చెల్లింపు అగ్రిగేటర్ ప్రాసెస్ చేస్తుంది. ఆ తరువాత ఆ మొత్తాన్ని వ్యాపారి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తుంది.
55
ఛార్జ్ ఎందుకు విధించబడుతోంది?
ప్రభుత్వం ఏ వ్యాపారవేత్త నుండి (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేయదు. ఇది ప్రస్తుతం సున్నా. కానీ NPCI బ్యాంకుల నుండి స్విచ్ ఫీజులను వసూలు చేస్తుంది. కొన్ని బ్యాంకులు చెల్లింపు అగ్రిగేటర్ల నుండి ఈ రుసుమును వసూలు చేస్తున్నాయి. ముఖ్యమైన చెల్లింపులపై ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. ఇటీవల, UPI చెల్లింపులు చేస్తున్నప్పుడు వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. UPI సర్వర్ ప్రతిరోజూ డౌన్ అయ్యేది. NPCI ఈ సమస్యకు ఈ పరిష్కారాన్ని కనుగొంది.