Salary: వచ్చే జీతాన్ని ఎలా ప్లాన్‌ చేయాలో అర్థం కావడం లేదా? ఇలా చేస్తే అస్సలు టెన్షన్‌ ఉండదు.

Published : Feb 09, 2025, 12:11 PM IST

ఎంత జీతం వచ్చినా ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. నెల చివరికి రూపాయి ఉండడం లేదు. చాలా మంది చెప్పే కామన్‌ డైలాగ్ ఇది. అయితే వచ్చే జీతాన్ని సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటా, ఆర్థికంగా ఎలాంటి నష్టాలు రావు. అలాంటి ఓ ప్లానింగ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
Salary: వచ్చే జీతాన్ని ఎలా ప్లాన్‌ చేయాలో అర్థం కావడం లేదా? ఇలా చేస్తే అస్సలు టెన్షన్‌ ఉండదు.

సరైన ప్లానింగ్ ఉండాలే కానీ తక్కువ జీతమైనా ఆర్థికంగా ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా ఉండొచ్చు. అన్ని అవసరాలకు అనుగుణంగా ఖర్చులను కేటాయిస్తే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. ఉదాహరణకు మీకు నెలకు రూ. 40 వేల జీతం వస్తుందని అనుకుందాం. ఈ జీతాన్ని ఎలా ప్లాన్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

23

* మీకు రూ. 40 వేల జీతం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి కిరాయి మీ జీతంలో 30 శాతం మించకూడదు. అంటే గరిష్టంగా రూ. 12 వేల కంటే ఎక్కువగా ఇంటి రెంట్‌కు కేటాయించకూడదన్నమాట. 

* అదే విధంగా ఆహారం, కిరాణ వస్తువులకు మీ జీతంలో 15 శాతాన్ని కేటాయించాలి. అంటే రూ. 6000 కేటాయించాలి. 

* ఇక రవాణా తదితర అవసరాల కోసం మీకు వచ్చే జీతంలో 10 శాతం కేటాయించాలి. అంటే రూ. 4000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదన్నమాట. 

* ఎలక్ట్రిసిటీ, వైఫై, మొబైల్‌, గ్యాస్‌, వాటర్‌ వంటి వాటికి 5 శాతం కేటాయించాలి. అంటే రూ. 2000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. 

* ఇక ప్రాథమిక అవసరమైన ఆరోగ్యం, ఇన్సూరెన్స్‌ కోసం మీ జీతంలో 5 శాతం ఖర్చు చేయాలి. అంటే రూ. 2 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. 
 

33

* వ్యక్తిగత అవసరాల కోసం 10 శాతం కేటాయించాలి. అంటే రూ. 4 వేలు ఇందుకోసం ఖర్చు చేయొచ్చు. 

* ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం అనివార్యంగా మారింది. వీటి చెల్లింపుల కోసం 5 శాతం కేటాయించాలి. అంటే రూ. 2000 మించకూడదన్నమాట. 

* అలాగే మీ జీతంలో కచ్చితంగా సేవింగ్స్‌ కోసం కొంతైనా కేటాయించాలి. పొదుపు కోసం కచ్చితంగా మీ జీతంలో 20 శాతం కేటాయించాలి. అంటే రూ.8000 పొదుపు చేయాలి. ఈ పొదుపును స్టాక్స్‌, పెన్షన్‌ స్కీమ్స్‌ వంటి వాటిలో పెట్టుబడిగా పెట్టొచ్చు. 

* ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం కనీసం 5 శాతాన్ని అంటే రూ. 2000 కేటాయిచాలన్నమాట. 

click me!

Recommended Stories