ఇది ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్లలో డ్రైవింగ్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశాలలో కూడా పార్కింగ్ చేయవచ్చు. MG కామెట్ EV క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఫుల్ వెడల్పు LED స్ట్రిప్, స్లీక్ హెడ్‌ల్యాంప్‌ల వంటి ఫీచర్లను కలిగి ఉంది. పెద్ద డోర్లు, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ రియర్ కూడా ఉన్నాయి.
10.25 అంగుళాల స్క్రీన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్ కూడా ఉన్నాయి. వివిధ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు తమ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు. మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాతావరణ సమాచారం, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ కారు నీలం, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగులలో లభిస్తుంది.