మీ ఏరియాలో BSNL 4G సిగ్నల్ ఉందా? ఇలా ఈజీగా చెక్ చేయండి

Published : Apr 29, 2025, 05:56 PM IST

BSNL 4G tower location: కారు, బండి పనిచేయకపోయినా ఉండగలం కాని.. ఇప్పుడు ఒక గంట సెల్ ఫోన్ పనిచేయకపోతే మన ప్రపంచం ఆగిపోతుంది కదా.. మీ ప్రాంతంలో సిగ్నల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో? వీక్ గా ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? అందుకే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL మీ ప్రాంతంలో 4G టవర్ ఉందో లేదో మొబైల్ ద్వారా సులభంగా చెక్ చేసుకొనే ఫెసిలిటీని తీసుకొచ్చింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

PREV
14
మీ ఏరియాలో BSNL 4G సిగ్నల్ ఉందా? ఇలా ఈజీగా చెక్ చేయండి

జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ కావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ దాని 4G నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తోంది. 

24

మీ ఫోనే రేడియో ట్రాన్స్ మిటర్... 

బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G టవర్లు ఏర్పాటు చేస్తోంది. కొన్ని నగరాల్లో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మీ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ 4G టవర్ లేకపోతే మీకు సరైన నెట్‌వర్క్ లభించదు. కాబట్టి మీకు దగ్గరలో బీఎస్ఎన్ఎల్ 4G టవర్ ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం.  

సిగ్నలింగ్ సిస్టమ్ లో మీ మొబైల్ ఫోన్ ఒక చిన్న రేడియో ట్రాన్స్‌మిటర్ లాగా పనిచేస్తుంది. మీరు కాల్ చేసినప్పుడు లేదా ఇంటర్నెట్‌ని ఉపయోగించినప్పుడు అది సిగ్నల్స్‌ను బయటకు పంపుతుంది. అదేవిధంగా బయట నుంచి వచ్చే సిగ్నల్స్ ని అందుకుంటుంది. కానీ ఈ సిగ్నల్స్ చాలా తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. 

 

34

సిగ్నల్స్ ని సులభంగా ఇలా చెక్ చేయండి

మీ మొబైల్ నుంచి వేరే ఎవరికైనా కాల్ చేసినా, లేదా కాల్ రిసీవ్ చేసుకున్నా టవర్ల ద్వారా ఇతర నెట్‌వర్క్‌లకు సిగ్నల్స్ వెళతాయి. అయితే టవర్ చాలా దూరంలో ఉంటే లేదా దానికి, మీ ఫోన్‌కి మధ్య బిల్డింగ్, చెట్టు, కొండ వంటి అడ్డంకులు ఉంటే నెట్‌వర్క్ బలహీనంగా ఉంటుంది. 

తరంగ్ సంచార్ అనే ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా మీ ప్రాంతంలోని బీఎస్ఎన్ఎల్, ఇతర కంపెనీల టవర్లను చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ కచ్చితమైన లొకేషన్, నెట్‌వర్క్.. అంటే 2G, 3G, 4G లేదా 5G గురించి సమాచారం అందిస్తుంది.

44

BSNL 4G టవర్‌ను చెక్ చేయడానికి ఇలా చేయండి

ముందుగా తరంగ్ సంచార్ EMF పోర్టల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

"మై లొకేషన్"పై క్లిక్ చేయండి.

మీ పేరు, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

"సెండ్ OTP"పై క్లిక్ చేయండి.

మీరు అందించిన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌కు OTP వస్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేయండి.

ఇప్పుడు మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే ఇంటరాక్టివ్ మ్యాప్ కనిపిస్తుంది.

ఏదైనా టవర్‌పై క్లిక్ చేసి దాని వివరాలను చూడండి. ఇక్కడ మీరు టవర్ సిగ్నల్ రకం (2G/3G/4G/5G), దాని టెలికాం కంపెనీ వివరాలు మీకు కనిపిస్తాయి. 

దీనిద్వారా మీ ప్రాంతంలో ఏ నెట్ వర్క్ సిగ్నల్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

ఇది కూడా చదవండి మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

Read more Photos on
click me!

Recommended Stories