రోజుకు రూ.7 పెట్టుబడితో రూ.5000 పెన్షన్ పొందొచ్చు: ఎలాగంటే..

Published : Apr 29, 2025, 04:54 PM IST

atal pension yojana: భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అలాంటి బెస్ట్ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అటల్ పెన్షన్ యోజన పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా? 

PREV
15
రోజుకు రూ.7 పెట్టుబడితో రూ.5000 పెన్షన్ పొందొచ్చు: ఎలాగంటే..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజనలో ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ వృద్ధాప్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. ఈ పథకంలో చేరితే 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు రూ.1000 నుండి రూ.5000 వరకు పెన్షన్ ఇస్తారు. అటల్ పెన్షన్ యోజన 18 నుండి 40 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారికి వర్తిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు కారు. 

25

20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి

అటల్ పెన్షన్ యోజన పథకంలో కనీసం 20 ఏళ్ళు పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ళ తర్వాత మీ పెట్టుబడి ఆధారంగా నెలవారీ పెన్షన్ వస్తుంది. నెలకు రూ.5000 పెన్షన్ రావాలంటే 18 సంవత్సరాల వయసున్న వ్యక్తి రోజుకు రూ.7 పొదుపు చేయాలి. అంటే నెలకు రూ.210 చెల్లించాలన్న మాట. 

35

రూ.5 వేలు పెన్షన్ రావాలంటే..

నెలకు రూ.168 చెల్లిస్తే రూ.4000 పెన్షన్ లభిస్తుంది. అదే నెలకు రూ.126 చెల్లిస్తే రూ.3000 పెన్షన్ వస్తుంది. రూ.84 చెల్లిస్తే రూ.2000, రూ.42 చెల్లిస్తే రూ.1000 పెన్షన్ లభిస్తుంది.

40 సంవత్సరాలు వయసున్న వ్యక్తి నెలకు రూ.5000 పెన్షన్ పొందాలంటే నెలకు రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.48 పొదుపు చేయాలన్న మాట. 

45

40 ఏళ్ళ వ్యక్తి తన వృద్ధాప్యంలో రూ.4000 పెన్షన్ పొందాలని అనుకుంటే నెలకు రూ.1164 కట్టాల్సి ఉంటుంది. అదే రూ.3000 పొందాలంటే రూ.873 చెల్లించాలి. ప్రతి నెలా రూ.582 కడితే  రూ.2000 పెన్షన్ వస్తుంది. కేవలం రూ.291 చెల్లిస్తే నెలకు రూ.1000 పెన్షన్ లభిస్తుంది. 

అటల్ పెన్షన్ యోజనలో నెల, త్రైమాసిక లేదా అర్ధ సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. బ్యాంక్ ఖాతా నుండి పెన్షన్ ఖాతాకు డబ్బు జమ అవుతుంది.

55

ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది..

అటల్ పెన్షన్ యోజనలో చేరిన వ్యక్తి పెన్షన్ పొందుతూ చనిపోతే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరూ చనిపోతే నామినీకి మొత్తం డబ్బు ఇస్తారు.

ఇది కూడా చదవండి బ్యాంకులో రూ.50 వేలు మించి డిపాజిట్ చేస్తే మీకు నోటీసు తప్పదు. ఎందుకంటే..

Read more Photos on
click me!

Recommended Stories