హీరో HF100లో కొత్తగా చేసిన మార్పులివే: లుక్ ఎంత బాగుందో

Published : Apr 29, 2025, 05:29 PM IST

Hero HF 100: పర్యావరణాన్ని కాపాడే నిబంధనలకు అనుగుణంగా హీరో కంపెనీకి చెందిన HF 100 కొత్త మార్పులతో మార్కెట్ లోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్ లో, చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి సరిపోయే విధంగా HF 100 కొత్తగా తయారైంది. మరి ధర పెరిగిందా? తగ్గిందా? బైక్ డిజైన్, ఫీచర్ల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
హీరో HF100లో కొత్తగా చేసిన మార్పులివే: లుక్ ఎంత బాగుందో

కొత్త OBD2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా హీరో తన HF 100 మోటార్ సైకిల్‌ని మార్చి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ధర ఇప్పుడు రూ.60,118. అంటే పాత దానికంటే సుమారు రూ.1,000 ధర పెరిగింది. కానీ బైక్ మొత్తం డిజైన్, ఫీచర్లు ఏమీ మారలేదు. ఈ బైక్ ఫీచర్లు, బైక్ పనితీరు గురించి తెలుసుకుందాం రండి. 

24

ధర ఎంత పెరిగింది.. 

హీరో HF 100 సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. పాత దానికంటే దీని ధర రూ.1,100 పెరిగింది. OBD2B ప్రమాణాలతో అనుగుణంగా మార్పులు చేసినందుకు గాను కాస్త ధర పెరిగింది. అన్ని ద్విచక్రవాహన కంపెనీలు ఇప్పుడు తమ పాత మోడల్స్ ని OBD2B ప్రమాణాలతో అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. 

హీరో HF 100 బైక్ రెండు రంగుల్లో లభిస్తుంది. బ్లూ గ్రాఫిక్స్‌తో బ్లాక్ కలర్ మోడల్ ఒకటి కాగా, రెడ్ గ్రాఫిక్స్‌తో బ్లాక్ కలర్ మోడల్ మరొకటి. 

34

ఇంజిన్ వివరాలు, పనితీరు

HF 100ని 97.2cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ నడుపుతుంది. ఇది 8.02 హార్స్‌పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది నమ్మదగిన, సమర్థవంతమైన రైడ్‌ను అందిస్తుంది. అదే ఇంజిన్ ఇతర ప్రసిద్ధ హీరో మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అవే ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ బైక్స్. అందుకే ఈ మోడల్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉన్నాయి. 

44

డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు

OBD2B ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయడం తప్ప హీరో HF 100 పెద్దగా మార్పులేవీ చేయలేదు. ఇది ఇంతకు ముందులాగే అదే డిజైన్, ఫీచర్లు, పనితీరును కనబరుస్తుంది.

బడ్జెట్ లో బెస్ట్ స్కూటర్ కోసం చూస్తుంటే ఈ మోటార్ సైకిల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories