Home Loan: గృహ రుణాన్ని భారంగా భావించే బదులు.. ఆర్థిక ప్రణాళికలను సిద్దం చేసి.. హోం లోన్ డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందొచ్చు.. మరి ఆ టెక్నిక్ ఏంటి.? ఎలా పొందుతామో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇల్లు కొనడం అనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. కానీ ఈ కల ఎవరికి సాకారం కాదు. డౌన్ పేమెంట్ నుంచి EMI వరకు ప్రతి విషయంలోనూ ప్రణాళిక చాలా అవసరం. గృహ రుణంపై మనం చెల్లించే వడ్డీ కొన్నిసార్లు తీసుకున్న మొత్తాన్ని సైతం మించిపోతుంది. కానీ ఈ భారీ వడ్డీ భారాన్ని కూడా తెలివిగా పెట్టుబడి ద్వారా తగ్గించవచ్చు.
25
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వివరాలు..
దానినే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) అని అంటారు. మీ EMIలో కేవలం 10 శాతం పెట్టుబడి పెట్టడం వల్ల మీ హోమ్ లోన్‌కు ఎక్కువ వడ్డీ కట్టినా.. ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు 8.5 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలానికి రూ. 50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. మీ నెలవారీ EMI సుమారు రూ. 43,400 ఉంటుంది. 20 సంవత్సరాలలో, మీరు బ్యాంకుకు మొత్తం రూ. 1.04 కోట్లు తిరిగి చెల్లిస్తారు. అంటే మీరు రూ. 50 లక్షల రుణంపై దాదాపు రూ. 54 లక్షల వడ్డీని చెల్లిస్తారు.
35
కోట్లు వెనకేసుకోవచ్చు..
దానిని మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు మీ EMIలో కేవలం 10 శాతం లేదా రూ. 4,300 ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ పెట్టుబడి 12 శాతం వార్షిక రాబడితో పెరిగితే, ఈ మొత్తం 20 సంవత్సరాలలో సుమారు రూ. 35 లక్షలు అవుతుంది. మీరు ప్రతి సంవత్సరం మీ SIPని 10 శాతం పెంచితే (మీ ఆదాయం పెరిగేకొద్దీ), ఈ మొత్తం రూ. 65 లక్షలకు పైగా చేరుకుంటుంది. దీని అర్థం SIP సహాయంతో, మీరు మీ వడ్డీలో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందడమే కాకుండా, రుణం తిరిగి చెల్లించే సమయానికి కోట్లు వెనకేసుకోవచ్చు.
SIP అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి విధానం. దీనిలో మీరు ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. ఇది కాంపౌండింగ్‌తో దీర్ఘకాలికంగా గణనీయమైన రాబడిని అందిస్తుంది. బ్యాంక్ మీకు నెలవారీ EMIలు వసూలు చేయడం ద్వారా వడ్డీని సంపాదిస్తుంది. మీరు కూడా SIP ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మంచి రాబడిని పొందవచ్చు.
55
రెండింటిని తెలివిగా బ్యాలెన్స్ చేయాలి..
EMI, SIP.. ఈ రెండింటిని తెలివిగా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం ద్వారా గృహ రుణాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ విధానం వడ్డీ భారాన్ని తగ్గించడమే కాకుండా పదవీ విరమణకు గణనీయమైన మొత్తాన్ని మీకు సమకూర్చుతుంది.