TATA Trust: టాటా ట్రస్టులో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే రతన్ టాటా మరణం తరువాత అంతర్గత గొడవలు బయటపడ్డాయి. ఇప్పుడు నెవిల్ టాటాను రతన్ టాటా వారసుడిగా ఎంపిక చేసుకున్నట్టు సంస్థ ప్రకటించింది.
భారతదేశంలోని అతి పెద్ద పారిశ్రామిక వంశాల్లో ఒకటి టాటా గ్రూప్. ఈ గ్రూప్ లో ఒప్పుడు కొత్త తరానికి అవకాశం లభించింది. రతన్ టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా నెవిల్ టాటా పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ఆయన సర్ దోరాబ్‌జీ టాటా ట్రస్ట్ లో కొత్త ట్రస్టీగా ఆయన నియమితులయ్యారు. ఈ ట్రస్ట్ టాటా గ్రూప్ ఫౌండేషన్‌లో అత్యంత శక్తివంతమైనది. నెవిల్ టాటాతో పాటు భాస్కర్ భట్ అనే సీనియర్ అధికారి కూడా ట్రస్టీగా నియమితులయ్యారు. వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉంటుంది. ఈ నియామకాన్ని నవంబర్ 12, 2025న ట్రస్ట్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో టాటా ట్రస్టులో కొత్త తరానికి ద్వారం తెరచినట్లయింది.
24
నెవిల్ టాటా ఎవరు?
నెవిల్ టాటా వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఆయన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా సోదరుడైన నోయెల్ టాటా కుమారుడు. నోయెల్ టాటా ప్రస్తుతం టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా ఉన్నారు. నెవిల్ ఉన్నత చదువులు చదివాడు. ఆధునిక ఆలోచనలతో కూడిన వ్యక్తి. ఆయన వ్యాపార రంగంలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెవిల్ టాటా గతంలో ట్రెంట్ లిమిటెడ్ లో పనిచేశారు. అది టాటా గ్రూప్‌కి చెందిన రిటైల్ కంపెనీ. ఆయన జూడియో అనే ఫ్యాషన్ బ్రాండ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. యువతకు దగ్గరైన బ్రాండ్‌గా దానిని తీర్చిదిద్దారు.
34
ఎంత కాలపరిమితితో ట్రస్టీ?
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ట్రస్టీల నియామకాలపై కొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చింది. ముందు ట్రస్టీలు జీవితకాలం పదవిలో ఉండేవారు. కానీ ఇప్పుడు మూడు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంది. దాంతో వేను శ్రీనివాసన్ వంటి సీనియర్ ట్రస్టీలు కూడా కాలపరిమితితో తిరిగి నియమితులవుతున్నారు. ఈ మార్పు నేపథ్యంలోనే నెవిల్ టాటా, భాస్కర్ భట్ లాంటి కొత్తవారు బోర్డులోకి వచ్చారు. టాటా కుటుంబ ఎప్పుడూ సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ట్రస్టులు విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, మహిళా శక్తివికాసం వంటి రంగాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. రతన్ టాటా ఈ ట్రస్టులను ఎంతో నిబద్ధతతో నడిపించారు. ఇప్పుడు ఆయన తరువాతి తరంగా నెవిల్ టాటా ముందుకు వస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.
నెవిల్ టాటా ట్రస్టులోకి రావడం వల్ల యువ రక్తం ప్రవేశించినట్టు అయింది. అందులోనూ రతన్ టాటా రక్త సంబంధీకుడే కావడం వల్ల అతనిపై అంచనాలు కూడా అధికంగా ఉన్నాయి. నెవిల్ టాటా భవిష్యత్తులో సర్ రతన్ టాటా ట్రాస్ట్ వంటి ఇతర ప్రధాన ట్రస్టులలో కూడా భాగం కావచ్చు. 32 ఏళ్ల నెవిల్ టాటా నియామకం టాటా ట్రస్టుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అనే చెప్పాలి. యువ నాయకత్వం, ఆధునిక ఆలోచనలు, సామాజిక బాధ్యతల పట్ల కట్టుబాటుతో టాటా సంస్థ మరింత బలపడనుంది.