Modi Salary: దేశ ప్రధానిగా మోదీ జీతం ఎంత? ఆ డబ్బును ఆయన ఎలా ఖర్చు పెడతారు?

Published : Sep 17, 2025, 10:11 AM IST

ప్రధాని మోదీ (Modi) సెప్టెంబరు 17వ తేదీన తన 75వ పుట్టినరోజు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా  మోదీకి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. ఇంతకీ మన దేశ ప్రధాని మోదీ జీతం ఎంతో మీకు తెలుసా? 

PREV
15
నరేంద్ర మోదీ పుట్టినరోజు

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 75 వ పుట్టినరోజును నేడు నిర్వహించుకుంటున్నారు. బీజేపీ శ్రేణులు చాలా చోట్ల ఈ వేడుకలను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ తరువాత దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ జీవితం ఎందరిలో ఆదర్శప్రాయం. ప్రధానిగా మోదీకి నెలకు కొంత జీతం వస్తుంది. ఆ జీతం ఎంత వస్తుందో, ఆ డబ్బును ఆయన ఏం చేస్తారో తెలుసుకోండి.

25
ప్రధాని మోదీ జీతం

మోదీకి ప్రధానిగా పనిచేస్తున్నందుకు నెలనెలా జీతంగా సుమారు రూ.1.66 లక్షలు అందుతుంది. ఇందులో రూపాయి కూడా ఖర్చు పెట్టరు ప్రధాని.  మరి ఆ డబ్బును ఆయన ఏం చేస్తారో తెలుసా?

35
సహాయనిధికి విరాళం

ప్రధాని మోదీ తన జీతాన్ని పూర్తిగా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, తన జీతాన్ని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేశారు కానీ తన కోసం రూపాయి కూడా ఖర్చుపెట్టుకోలేదు.

45
ఆయన ఖర్చులకు?

మోదీ ప్రజాసేవే నిజమైన బాధ్యత అని నమ్మారు. అందుకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన జీతాన్ని ఖర్చు పెట్టుకోలేదు.  ప్రధాని అయ్యాక కూడా తన జీతాన్ని దేశ సంక్షేమం కోసమే ఇచ్చేస్తున్నారు. ఇక మోదీ ఖర్చులు ఎలా? ప్రధానిగా ఉన్న ఆయనకు ప్రయాణం, ఆహారం వంటి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల మోదీకి అదనంగా ఎలాంటి డబ్బు అవసరం ఉండదు.

55
మోదీ ఆస్తులు ఎంత?

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రధాని మోదీకి రూ.3 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. 2018-19లో కేవలం రూ.11.14 లక్షల ఆస్తి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆయన ఆస్తి మూడు కోట్లకు చేరింది.

Read more Photos on
click me!

Recommended Stories