GST: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు రంగాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి గృహ నిర్మాణంపై జీఎస్టీ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇల్లు కట్టుకోవాలనే కల చాలా మందికి ఉంటుంది. అయితే పెరుగుతున్న నిర్మాణ ఖర్చులతో చాలా మంది ఇంటి నిర్మాణానికి వెనుకడుగు వేస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్మాణ సామగ్రిపై GST రేట్లను తగ్గించడంతో గృహ నిర్మాణ ఖర్చు కొంత చవకగా మారింది. ముఖ్యంగా సిమెంట్, గ్రానైట్, పాలరాయి, ఇటుక వంటి వాటిపై పన్ను తగ్గడంతో 2BHK ఫ్లాట్ నిర్మాణ వ్యయం తగ్గనుంది.
25
60 గజాల ఫ్లాట్‌కి లెక్కిస్తే..
1 గజం = 9 చదరపు అడుగులు. దీంతో 60 గజాలు అంటే సుమారు 540 చదరపు అడుగులు.
సాధారణ నాణ్యత గల ఇంటి నిర్మాణం: చదరపు అడుగుకు రూ.1500 నుంచి రూ. 1800 వరకు అవుతుంది.
మెరుగైన నాణ్యత (స్టాండర్డ్): చదరపు అడుగుకు రూ. 2200 నుంచి రూ. 2500 అవుతుంది. దీంతో బేసిక్ ఫ్లాట్ (₹1500 × 540) → సుమారు ₹8.10 లక్షలు, స్టాండర్డ్ ఫ్లాట్ (₹2200 × 540) → సుమారు ₹11.88 లక్షలు అవుతుంది.
35
GST తగ్గింపుతో ఎన్ని రూపాయలు ఆదా అవుతాయి?
సిమెంట్‌పై GST 28% నుంచి 18%కి తగ్గింపు
గ్రానైట్, మార్బుల్ వంటి ఫినిషింగ్ మెటీరియల్స్‌పై GST 12% నుంచి 5%కి తగ్గింపు
దీంతో నిర్మాణ ఖర్చులో సుమారు 3%–5% వరకు తగ్గింపు ఉంటుంది.
ఈ లెక్కిస్తే బేసిక్ ఫ్లాట్ → ₹7.8 – ₹8 లక్షలు
స్టాండర్డ్ ఫ్లాట్ → ₹11.3 – ₹11.8 లక్షలు అవుతుంది.
ఇంటి నిర్మాణంలో విద్యుత్ కనెక్షన్, నీటి కనెక్షన్, లేబర్ ఖర్చులు వేరుగా ఉంటాయి. ఇవి GST తగ్గింపులో లేవు. కానీ, నిర్మాణ సామగ్రిపై తగ్గింపుతో గృహనిర్మాణదారులు నేరుగా లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది.
55
గృహ నిర్మాణ రంగంపై ప్రభావం
ఈ ధరల తగ్గింపు కారణంగా నిర్మాణ రంగంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఇప్పుడు కొంచెం సులభంగా నెరవేరే అవకాశం ఉంది. GST తగ్గింపుతో రాబోయే రోజుల్లో గృహ నిర్మాణ రంగం మరింత వేగంగా పెరగనుంది.