Amazon Flipkart Festival Sales: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్‌లో ఇలా కొంటే మరింత ఆదా చేసుకోవచ్చు

Published : Sep 16, 2025, 05:06 PM IST

అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లు మనదేశంలో పండుగ సీజన్ సేల్స్ (Sales) ప్రారంభించబోతున్నాయి. ఈ సేల్స్ లో భారీ డిస్కౌంట్లను కూడా ఇవ్వబోతున్నాయి. మీరు పండుగ సీజన్‌లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

PREV
16
షాపింగ్ ఫెస్టివల్ మొదలు

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పండుగ సీజన్ సేల్స్ ప్రకటించారు. దీని కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందులో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు కూడా రాబోతున్నాయి. మీరు వాటిని కొనేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే మాత్రం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.

26
బడ్జెట్ నిర్ణయించుకోండి

పండుగలకి ఏవైనా కొనేటప్పుడు బడ్జెట్ ను ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ డబ్బుకు మించి ఖర్చుపెట్టకూడదు. ఒక పరిమితి లేకుండా ఖర్చు చేయడం వల్ల అదనంగా ఖర్చయిపోయే ప్రమాదం ఉంది. చివరికి మీ జేబు ఖాళీ అవుతుంది. ముందుగా బడ్జెట్ వేసుకుని, దానికి అనుగుణంగా ఖర్చు చేయడం మంచిది.

36
డిస్కౌంట్లకు పడిపోవద్దు

పండుగ సమయంలో మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో  డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తారు.  ఫ్లాష్ సేల్, పరిమిత కాల ఆఫర్‌ల వంటి ట్రిక్స్ ఉపయోగిస్తారు. అవి మిమ్మల్ని కొనేలా ప్రేరేపిస్తాయి. కానీ  వాటికి లొంగకూడదు. అవసరమైతేనే ఏ వస్తువైనా కొనాలి.

46
ధరలను పోల్చండి

షాపింగ్ చేయాలనే హడావిడిలో ఏదో ఒకటి కొనేస్తారు. కానీ ఇతర సైట్లలోని ధరలతో సరిపోల్చుకోవాలి. ఎందులో తక్కువ ధరకు వస్తే అందులో కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే మీకు మంచి వస్తులు తక్కువ ధరకే రావచ్చు.

56
క్రెడిట్ కార్డులు వాడకండి

క్రెడిట్ కార్డులను వాడే వారే ఎక్కువ. వాటిని వాడడం వల్ల ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇది అప్పుల భారాన్ని పెంచుతుంది. అప్పుల ఒత్తిడి లేకుండా ఉండేలా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే వస్తువును కొనుక్కోవాలి.

66
రేటింగ్ చూడండి

ఖరీదైన వస్తువు కొనే ముందు తప్పకుండా యూజర్ రివ్యూలు చదవండి.  ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి కొనేటప్పుడు కస్టమర్ రివ్యూలు తప్పకుండా చదవాలి. అలాగే దాని రేటింగ్ కూడా చెక్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories