పైన చెప్పిన నియమాల ప్రకారం బంగారం మీ దగ్గర ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆదాయపు పన్ను శాఖ అకస్మాత్తుగా తనిఖీ చేసినా కూడా ఎలాంటి సమస్యలు రావు. వాటిని జప్తు చేయరు. ఈ పరిమితులు 1994లో CBDT విడుదల చేసిన సర్క్యులర్ ఆధారంగా తయారు చేశారు. ఇది వివాహం, వారసత్వంగా వచ్చే నగలను రక్షించడానికి రూపొందించారు.
పరిమితికి మించి బంగారం మీ దగ్గరుంటే ఆ బంగారానికి సంబంధించిన పత్రాలు (కొనుగోలు రసీదులు, వారసత్వ పత్రాలు లేదా పన్ను మినహాయింపు పొందిన ఆదాయంతో కొనుగోలు చేసినట్లు ఆధారాలు) చూపించాల్సిన అవసరం ఉంది.
పన్ను నిబంధనలు: బంగారాన్ని ఉంచుకోవడానికి పన్ను లేదు. కానీ దానిని అమ్మేటప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 3 సంవత్సరాలకు పైగా ఉంచి అమ్మితే, 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG), 4% సెస్ విధించబడుతుంది.