Published : Sep 11, 2025, 02:22 PM ISTUpdated : Sep 11, 2025, 02:37 PM IST
మొన్నటి వరకు ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందాడు. ఇప్పుడు ఆ కిరీటాన్ని అతను కోల్పోయాడు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడైన లారీ ఎల్లిసన్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.
టెస్లా యజమాని అయిన మస్క్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడి పాలన ముగిసినట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ నిలిచాడు. త్రైమాసిక ఫలితాల ద్వారా లారీ ఎల్లిసన్ సంపద 101 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు తెలిసింది. దీంతో ఆయనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.
25
ఎలన్ మస్క్ ఆస్తి ఎంత?
బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతం లారీ ఎలిసన్ సంపద 393 బిలియన్ డాలర్లుగా తేలింది. ఇది మస్క్ సంపద కంటే ఎక్కువ. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద 385 బిలియన్ డాలర్లుగా ఉంది.
35
లారీ ఎలిసన్ ఎవరు?
లారీ ఎల్లిసన్ వయసు ఇప్పుడు 81 ఏళ్లు. అతను ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు. ఆ కంపెనీ చైర్మన్ గా కూడా ఉన్నాడు. అతని సంపదలో ఎక్కువ భాగం సాఫ్ట్ వేర్ కంపెనీలో పెట్టుబడుల రూపంలోనే ఉన్నాయి.
ఈ ఏడాది ఒరాకిల్ షేర్లు 45 శాతం పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. దీంతో లారీ ఎలిసిన్ ఆస్తులు కూడా పెరిగాయి. అయితే దీనికి విరుద్ధంగా ఈ ఏడాది టెస్లా షేర్లు 13 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఎలాంటి జాబితాలో రెండో స్థానానికి చేరిపోయాడు.
55
మస్క్ మళ్లీ వచ్చేనా?
2021లో మొదటిసారిగా మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఆ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వంటి వారు కూడా మొదటి స్థానంలోకి వచ్చారు. కానీ గత ఏడాది మస్క్ తిరిగి అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలోకి వచ్చాడు. కానీ ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. లారీ ఎలిసన్ చేతిలో ఓడిపోయాడు. భవిష్యత్తులో అతను తిరిగి ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి.