మన దేశంలో ఎన్నో రైళ్లు ఉన్నాయి. అన్నింట్లో అతి మురికి రైలుగా పేరు తెచ్చుకుంది ఒక ట్రైను. దీనిలో ప్రయాణం చేయడం చాలా కష్టం. అయితే ఈ ట్రైన్‌కి టికెట్లు కూడా దొరకవు. అంతగా ప్రయాణికులు దీనిలో ప్రయాణం చేస్తారు.
వందే భారత్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్న రైలులో ప్రయాణం చేశాక మన దేశంలో ఉన్న కొన్ని మురికి రైళ్లల్లో ప్రయాణం చేయలేరు. మన దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఉన్నాయి. కొన్ని నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాయి. మరికొన్ని ఎక్కువ దూరాలు ప్రయాణిస్తాయి. అన్నింట్లో వందే భారత్, రాజధాని ఎక్స్ ప్రెస్ వంటివి ఎక్కువ సౌకర్యాలను కలిగి ఉంటాయి. అయితే మన రైళ్లలో కొన్ని మురికి రైళ్లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
25
మురికి రైళ్లపై నివేదిక
అత్యంత మురికి రైళ్లు అని చెప్పి ఏ ట్రైన్లకు కూడా అధికారికంగా బిరుదును ఇవ్వలేదు. ట్రైన్లు మురికిగా ఉన్నాయనే ఫిర్యాదులు ఆధారంగానే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మురికి రైళ్ల జాబితా గురించి చెప్పుకోవచ్చు. రైళ్లల్లో మురికిగా ఉంటే ఫిర్యాదులు చేయమని రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను ఇస్తూ ఉంటుంది. ఆ నెంబర్లకి కాల్ చేయడం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి రైళ్ల విషయంలో ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది.
35
పరమ మురికి రైలు
ట్రావెల్ వ్లాగర్ అయినా ఉజ్వల సింగ్ అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అతను రైలు లోపల ఉన్న మురికి, చెత్తచెదారం చూపించారు. రైలు పేరు కన్యాకుమారి వివేక ఎక్స్‌ప్రెస్. ఆ రైలులో ప్రయాణం చేయడం అంటే నరకంతో సమానమేనని అనిపిస్తుంది. ఇది 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది దేశంలోనే అత్యంత మురికి రైలుగా ప్రజలు చెప్పుకుంటారు. ఈ రైలు కన్యాకుమారిలో మొదలై దిబ్రూగడ్ వరకు ప్రయాణిస్తుంది. ఇలా వెళ్లడానికి 74 నుండి 75 గంటలు పడుతుంది. 9 రాష్ట్రాల గుండా ప్రయాణించే ఈ రైలులో అత్యంత దుర్వాసన వస్తూ ఉంటుంది.
ప్రస్తుతం రైల్వే సౌకర్యాలను ఐఆర్సిటిసి పెంచుతూనే ఉంది. కానీ కొన్ని రైళ్లల్లో మాత్రం ఇంకా ఎలాంటి పరిశుభ్రతను పాటించడం లేదు. అమృత్సర్ నుండి వెళ్లే గరీబ్ రథ్ రైలు కూడా భారతదేశంలోనే మురికి రైలుగా చెప్పుకోవచ్చు. పంజాబ్లోని అమృత్సర్ నుండి ఇది బయలుదేరి బీహార్లోని సహర్సా జిల్లా వరకు వెళుతుంది. టికెట్ ధర కూడా ఎక్కువే ప్రజలు కూడా ఈ రైలును ఎక్కువగానే బుక్ చేసుకుంటారు. కానీ కోచ్ లన్నీ మురికి గానే ఉంటాయి.
55
ఇవి కూడా మురికి రైళ్లే
పైన చెప్పిన రైళ్లు మాత్రమే కాదు జోగ్‌బాని ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్ ప్రెస్, బాంద్రా వైష్ణోద్వేవీ స్వరాజ్ ఎక్స్ ప్రెస్, ఫిరోజ్పూర్ అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ వంటివి కూడా. మురికి రైళ్లలో నీరు సరిగా రాదు. దుప్పట్లు కూడా మురికిగా ఉంటాయి. సీట్లు చిరిగిపోయి బాత్రూం కంపు కొడుతూ ఉంటుంది.