Salary Account: మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? అయితే.. ఈ ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే..

Published : May 16, 2025, 11:31 AM IST

Salary Account: చాలా మందికి బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి. కానీ, వారు తీసుకున్న ఖాతాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వారికి తెలియదు.  బ్యాంకు లో కరెంట్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా, సేవింగ్స్ ఖాతా వంటి వివిధ రకాల ఖాతాలుంటాయి. అందులో శాలరీ అకౌంట్‌ కు ప్రత్యేక ప్రయోజనాలున్నాయి.     

PREV
19
Salary Account: మీకు శాలరీ అకౌంట్‌ ఉందా?  అయితే.. ఈ ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే..
శాలరీ ఖాతా

చాలా మంది ఉద్యోగుల జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆఫీస్ వారు శాలరీ అకౌంట్ తెరిచిస్తారు.

29
శాలరీ ఖాతా ప్రయోజనాలు

ఏదైనా సాధారణ ఖాతా లాగానే ఈ ఖాతాను కూడా వాడుకోవచ్చు. కానీ ఈ జీతం ఖాతాలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. వీటి గురించి బ్యాంకులు సాధారణంగా చెప్పవు.

39
ఆర్థిక భద్రత

శాలరీ ఖాతా ఉన్నవారికి బ్యాంకు చాలా ప్రయోజనాలను కల్పిస్తుంది. ప్రధానంగా శాలరీ అకౌంట్ ఉన్నవారికి ప్రమాద మరణం లేదా ఆరోగ్య బీమా లాంటివి ఉంటాయి. ఇవి ఆర్థిక భద్రతను పెంచుతాయి.

49
రుణాలకు ప్రాధాన్యత

వ్యక్తిగత లేదా గృహ రుణాలకు దరఖాస్తు చేసేటప్పుడు శాలరీ అకౌంట్ ఉన్నవారికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయి. బ్యాంకులు శాలరీ  ఖాతా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తాయి. రుణాలు తక్కువ వడ్డీకి దొరుకుతాయి.

59
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం

శాలరీ అకౌంట్ ఉన్నవారి మరో ముఖ్యమైన ప్రయోజనమేమిటంటే.. ఈ  ఖాతా వారికి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. ఖాతాలో డబ్బులు లేకపోయినా కొంత డబ్బు తీసుకోవచ్చు.

69
ఉచిత క్రెడిట్ కార్డులు

చాలా బ్యాంకులు ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు, ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాయి. వార్షిక రుసుము, రివార్డ్ పాయింట్లపై డిస్కౌంట్లు ఉంటాయి.

79
షాపింగ్, డైనింగ్ ఆఫర్లు

శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఆన్‌లైన్ షాపింగ్, డైనింగ్ ఆఫర్లు ఇస్తాయి బ్యాంకులు. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఉంటాయి.

89
జీతం ఖాతా: ఉచిత డిజిటల్ లావాదేవీలు

శాలరీ అకౌంట్ ఉన్నవారి NEFT, RTGS లాంటి డిజిటల్ లావాదేవీలు ఉచితంగా అందించబడును. అలాగే ఇతర ఖాతాదారుల కంటే శాలరీ అకౌంట్ ఉన్నవారికి ప్రాధ్యానత ఎక్కువ. .

99
జీరో బ్యాలెన్స్ సౌకర్యం

శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఉంటుంది. కనీస నిల్వ ఉంచనవసరం లేదు. ఇది మరో ప్రయోజనం. 

Read more Photos on
click me!

Recommended Stories