Oyo: ఓయో ఫస్ట్ పేరు ఏంటో తెలుసా? ఇంతకీ దీని అసలు అర్థం ఏంటంటే..

Published : May 15, 2025, 08:39 PM IST

ఓయో.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలు, సులభమైన బుకింగ్‌, తక్కువ డాక్యుమెంటేషన్‌ వంటి లాభాల వల్ల ఇతర హోటళ్లతో పోల్చితే ఓయో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఓయో చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Oyo: ఓయో ఫస్ట్ పేరు ఏంటో తెలుసా? ఇంతకీ దీని అసలు అర్థం ఏంటంటే..
OYO Room

OYO ప్రయాణం ఎలా మొదలైంది?

OYO అనే హాస్పిటాలిటీ సంస్థను రితేష్ అగర్వాల్ అనే యువ పారిశ్రామికవేత్త 2013లో స్థాపించారు. ఓయోను ప్రారంభించిన సమయంలో "Oravel Stays"గా పేరు పెట్టారు. 2013లో దాన్ని "OYO Rooms"గా మార్చారు. OYO అనే పేరు ఫుల్ ఫారం "On Your Own", అంటే "మీ స్వంత గది" అన్న భావనతో ఈ పేరు పెట్టారు. ప్రతి కస్టమర్‌కి స్వంతగదిలా అనిపించేలా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పేరును పెట్టారు. 

24

ఇతర హోటళ్ల కంటే ఏం ప్రత్యేకం?

ఇతర హోటళ్లతో పోలిస్తే OYOలో గదుల అద్దె ఖర్చు తక్కువగా ఉంటుంది. మామూలు బడ్జెట్‌లోనే మంచి సదుపాయాలు లభిస్తాయి. హోటల్ గదికి వెళ్లకుండానే ఓయో యాప్‌ ద్వారా ముందుగానే గదిని బుక్ చేసుకోవచ్చు. ఇది సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. ఇతర హోటళ్లలో అడిగే విధంగా చాలా వివరాలు అవసరం ఉండవు. ఒక ఆధార్‌ లేదా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. 

34
oyo rooms

ఫ్రాంచైజీ మోడల్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో OYO హోటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణిస్తున్నవారికి ఎక్కడ ఉన్నా దగ్గర్లోనే ఒక OYO హోటల్‌ దొరికే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకే AC గదులు, హౌస్‌కీపింగ్‌, ఉచిత Wi-Fi వంటి సౌకర్యాలు అందించడం వల్ల కస్టమర్లు సంతృప్తిగా ఉంటున్నారు. వినియోగదారులకు సులభతరం, నమ్మకమైన సేవలు, తక్కువ ఖర్చుతో మంచి అనుభూతిని అందించడమే OYO విజయానికి కారణంగా చెప్పొచ్చు.

44

ముఖ్యంగా ట్రావెలింగ్ యువత, జీతభత్యాల మధ్యతరగతి ప్రయాణికులు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. OYO అనేది వినియోగదారుల అవసరాలను గుర్తించి, వాటిని తక్కువ ఖర్చుతో తీరుస్తున్న హాస్పిటాలిటీ బ్రాండ్‌. గది మీ సొంత గదిలా అనిపించాలన్న లక్ష్యంతో రూపొందిన ఈ ప్లాట్‌ఫారమ్‌ టెక్నాలజీ ఆధారంగా సేవలను మరింత సులభతరం చేసింది. అందుకే ఇది దేశంలోనే అతిపెద్ద హోటల్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది.

Read more Photos on
click me!

Recommended Stories