Cheapest cars: అధిక మైలేజీని ఇస్తూ అయిదు లక్షలలోపు ధరకే వచ్చే కార్లు ఇవిగో

Published : Sep 18, 2025, 11:14 AM IST

మనదేశంలో అతి తక్కువ ధరకే రూ.5 లక్షలలోపు బడ్జెట్ కార్లు ఉన్నాయి. ఇవన్నీ చవక కార్ల (Cheapest cars) జాబితాలోకి వస్తాయి.  మారుతి, టాటా, రెనాల్ట్ వంటి కార్లు ఇప్పుడు చవక కార్లను అందిస్తున్నాయి. దీపావళికి వీటిని కొనేందుకు సిద్ధమైపోండి.

PREV
14
రూ.5 లక్షల బడ్జెట్ కార్లు

మనదేశంలో మధ్యతరగతి కుటుంబాలే అధికం. అందుకోసమే చవక కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ.5 లక్షల బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, తక్కువ నిర్వహణ ఖర్చు అవసరమైన కార్లు కావాలనుకుంటారు. మారుతి, రెనాల్ట్, టాటా ఈ విభాగంలో ఎన్నో మోడళ్లను అందిస్తున్నాయి.

24
మారుతి ఆల్టో K10

మారుతి ఆల్టో K10 చాలా పాపులర్ మోడల్. 1.0-లీటర్ ఇంజన్‌తో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు అందిస్తుంది. అందుకే ఇది కుటుంబాల మొదటి ఎంపిక. సింపుల్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ దీని బలం.

34
టాటా టియాగో

టాటా టియాగో భద్రతలో ఉత్తమ రేటింగ్ పొందిన కారు. రూ.5 లక్షల ధరలలో కుటుంబాలకు సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంది. స్టైలిష్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీ, ఫీచర్ల వల్ల ఇది బడ్జెట్ విభాగంలో గట్టి పోటీదారు.

44
రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ చౌక ధరలో SUV లాంటి డిజైన్‌తో వస్తుంది. రూ.4.70 లక్షల ధరలో స్టైలిష్ లుక్, టెక్ ఫీచర్లు అందిస్తుంది. దీని 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ సిటీ, హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories