ఆండ్రాయిడ్, iOS రెండింటికీ అధికారిక NTES యాప్ అందుబాటులో ఉంది. యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి NTES యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ తెరిచి 'స్పాట్ యువర్ ట్రైన్' ఎంచుకోండి. రైలు పేరు లేదా నంబర్ ఎంటర్ చేసి 'షో ఇన్‌స్టాన్సెస్'పై ట్యాప్ చేయండి. స్క్రీన్‌పై రైలు కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి రూట్ మ్యాప్, స్టేటస్ చూడొచ్చు.