Aadhaar and PAN: ఫోన్‌లో ఆధార్, పాన్ ఫోటోలు సేవ్ చేస్తున్నారా? ఆన్‌లైన్ మోసం బారిన పడతారు జాగ్రత్త

Published : Sep 17, 2025, 02:53 PM IST

ఇప్పుడు అందరూ ఫోన్లోనే ఆధార్ (Aadhar) కార్డు, పాన్ కార్డు (PAN) వంటి డాక్యుమెంట్లు ఫోటోలు సేవ్ చేసుకుంటారు. కాని ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. ఇలా ఫోన్లో ఆధార్, పాన్ ఉండడం వల్ల సైబర్ మోసాలా బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

PREV
14
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి

ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న కాలం ఇది. బ్యాంక్ ఖాతా మోసాలు, ఏటీఎం మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఎంతో మంది ఆధార్, పాన్ వంటి గుర్తింపు పత్రాల ఫోటోలను నేరుగా ఫోన్‌లో సేవ్ చేసుకుంటున్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఇంకా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

24
డిజిటల్ ఇండియా

డిజిటల్ ఇండియా కాలంలో ఆన్ లైన్, సైబర్ మోసాలు జరగడం సర్వసాధారణమైంది. కానీ సైబర్ నిపుణులు దీన్ని పెద్ద ప్రమాదంగా హెచ్చరిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ల ద్వారా మోసగాళ్లు బ్యాంక్ ఖాతాలు, నకిలీ కేవైసీ, సిమ్ స్వాప్ మోసాలు చేయగలరు.

34
డిజి లాకర్ పెట్టుకోండి

ఫోన్‌లో ఆధార్, పాన్ ఫోటోలు ఉంచడం తాళం వేయని పెట్టెతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా ప్రభుత్వ డిజిలాకర్ యాప్‌ను వాడటం సురక్షితం. ఇది ఎన్‌క్రిప్టెడ్ స్టోరేజ్ అందిస్తుంది. 

44
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఫోన్ సెక్యూరిటీని అప్‌డేట్ చేయడం, బలమైన పాస్‌వర్డ్‌లు వాడటం, అనవసర యాప్ పర్మిషన్లను నియంత్రించడం కూడా ముఖ్యం. సులభంగా ఉంటుందని ఫోన్‌లో డాక్యుమెంట్లు సేవ్ చేస్తే, అది ఎప్పుడైనా ఇబ్బందులు పాలయ్యేలా చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories