Cars: ఇప్పుడు కార్లు తక్కువ ధరకు మంచి ఫీచర్లతో వస్తున్నాయి. మధ్యతరగతి వారు పదిలక్షల రూపాయల్లోపు కొనేందకు బెస్ట్ కార్లు ఇవి. 360-డిగ్రీ కెమెరా ఫీచర్ ఇప్పుడు బడ్జెట్ కార్లలోనూ వచ్చేసింది. అవి ఏ కార్లో తెలుసుకోండి.
కారు కొనాలనుకునేవారు ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉండాలని కోరుకుంటారు. సేఫ్టీతో పాటూ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉండాలని అనుకుంటారు.అందుకే కార్ల కంపెనీలు, ఒకప్పుడు ఖరీదైన కార్లలో మాత్రమే ఉండే ఫీచర్లను ఇప్పుడు బడ్జెట్ కార్లలోనూ అందిస్తున్నాయి.
ఈ ఫీచర్‌తో తక్కువ ధరలో లభించే కార్లలో టాటా టియాగో ఒకటి. టాటా కంపెనీ కొత్త డిజైన్, మెరుగైన క్యాబిన్‌తో పాటు టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరాను అందిస్తోంది. ఈ కారు ధర రూ.4.69 లక్షల నుంచి రూ.7.99 లక్షల మధ్య ఉంటుంది. అందుకే బడ్జెట్ కారు.
24
మారుతి సుజుకి బాలెనో
మారుతి సుజుకి బాలెనోలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పాపులర్ అయిన మోడల్‌లో 360-డిగ్రీ కెమెరాను చేర్చారు. ముఖ్యంగా పట్టణాల్లో దీనికి ఆదరణ పెరిగింది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, రూ.9.10 లక్షలలోపు ధరతో బాలెనో ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
34
రెనాల్ట్ కైగర్
SUVలను ఇష్టపడేవారికి రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మంచి ఎంపికలు. ఈ రెండు కార్లలో 360-డిగ్రీ కెమెరా, పలు గేర్‌బాక్స్ ఆప్షన్లు, ఆధునిక డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా సిటీ ప్రయాణాలు, ఫ్యామిలీ ట్రిప్పులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడళ్లను రూపొందించారు.
టాటా కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ మైక్రో-SUV పంచ్ కూడా ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీనిలోని ఇంజిన్ ఆప్షన్లు, 360-డిగ్రీ కెమెరా ఫీచర్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే, 360-డిగ్రీ కెమెరా ఇకపై లగ్జరీ కార్లకే పరిమితం కాదు. రూ.10 లక్షలలోపు కూడా ప్రీమియం అనుభూతిని పొందవచ్చని ఈ కార్లు నిరూపిస్తున్నాయి.