Foot Massager: రోజంతా నిలబడి పని చేయడం, ఎక్కువసేపు నడవడం లేదా వయస్సు పెరగడం వల్ల చాలా మందికి కాళ్ల నొప్పులు, పాదాల్లో అలసట, కండరాల బిగుతు వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారి కోసం అమెజాన్‌లో ఒక మంచి ఫుట్ మసాజర్ అందుబాటులో ఉంది.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో లైఫ్‌లాంగ్ ఫుట్ మసాజర్ మిషన్ (LLM360) పేరుతో ఒక మసాజర్ అందుబాటులో ఉంది. ఇంట్లోనే కూర్చొని మసాజ్ చేయించుకున్న అనుభూతిని కలిగించేలా ఈ పరికరాన్ని రూపొందించారు. ధర విషయానికొస్తే ఈ ప్రొడక్ట్ అసలు ధర రూ. 16,300కాగా ఏకంగా 71 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 4699కే లభిస్తోంది. ఈ ఫుట్ మసాజర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సిబుల్ రబ్బర్ నీడింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి పాదాలపై ఒత్తిడి కలిగిస్తూ నిజమైన మసాజ్ చేసినట్లుగా అనిపిస్తాయి. రోజంతా పని చేసి అలసిపోయిన కాళ్లకు విశ్రాంతిని అందించడంలో ఇది సహాయపడుతుంది. పాదాల్లోని ముఖ్యమైన ప్రెషర్ పాయింట్లపై పనిచేయడం ద్వారా శరీరంలోని ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
25
మీ అవసరానికి అనుగుణంగా మసాజ్ ఎంపిక
ఈ మసాజర్‌లో నాలుగు ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లు, మూడు కస్టమైజ్డ్ మసాజ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా మసాజ్‌ను ఎంచుకోవచ్చు. మసాజ్ స్పీడ్, దిశను కూడా సులభంగా మార్చుకునే అవకాశం ఉంది. అందువల్ల తక్కువ ఒత్తిడితో లేదా ఎక్కువ ఒత్తిడితో మసాజ్ కావాలనుకునే వారు తమకు అనుకూలంగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
35
శక్తివంతమైన పనితీరు, భద్రతకు ప్రాధాన్యం
ఈ పరికరంలో 40 వాట్ల మోటార్‌ను అమర్చారు. ఇది వైబ్రేషన్ టెక్నాలజీ ద్వారా పాదాలకు మసాజ్ అందిస్తుంది ఇందులో 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్లు సమయాన్ని గమనించాల్సిన అవసరం ఉండదు. భద్రతతో పాటు విద్యుత్ వినియోగాన్ని కూడా ఇది నియంత్రిస్తుంది.
ఈ ఫుట్ మసాజర్‌ను కాంపాక్ట్ డిజైన్‌తో తయారు చేశారు. అందువల్ల ఇంట్లో ఉపయోగించడమే కాకుండా ఆఫీస్‌లో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఎక్కువ స్థలం అవసరం లేకుండా కుర్చీలో కూర్చుని ఉపయోగించుకునే విధంగా దీనిని రూపొందించారు. సుమారు 5.1 కిలోల బరువు ఉండటం వల్ల స్థిరంగా పనిచేస్తుంది. రోజువారీ జీవనశైలిలో భాగంగా దీనిని ఉపయోగించడం ద్వారా కాళ్లకు విశ్రాంతి కల్పించవచ్చు.
55
ఎలా పనిచేస్తుంది.?
నేటి బిజీ జీవితంలో కాళ్ల అలసట, పాదాల నొప్పులు చాలా సాధారణ సమస్యలుగా మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే మసాజ్ సదుపాయం పొందాలనుకునే వారికి Lifelong Foot Massager ఉపయోగకరమైన ఎంపికగా చెప్పవచ్చు. కాళ్లకు రిలాక్సేషన్ అందించడంతో పాటు రోజువారీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకే వినియోగించడం ఉత్తమం.