జీఎస్టీలో కొత్త మార్పులు: చవకమ్మ చవక.. ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి

Published : Sep 03, 2025, 11:56 PM ISTUpdated : Sep 04, 2025, 12:02 AM IST

GST Tax Rates: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. రోజువారీ వస్తువులు చౌకగా మారనున్నాయి. విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులు మరింత ఖరీదు అవుతాయి. మొత్తంగా ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
జీఎస్టీ కౌన్సిల్ బిగ్ డెసిషన్

జీఎస్టీలో కొత్త మార్పులు వచ్చాయి. 2017లో ప్రారంభమైన వస్తు సేవల పన్ను (GST) లో ఇదే అతిపెద్ద మార్పు అని చెప్పొచ్చు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో పన్ను రేట్లను క్రమబద్ధం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

సెప్టెంబర్ 22 నుంచి రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. అవి 5%, 18%. అలాగే, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, విలాస వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% రేటును తీసుకొచ్చారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. “మేము స్లాబ్‌లను తగ్గించాము. ఇక రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. సాధారణ ప్రజలకు ఉపయోగపడే వస్తువులపై తగ్గింపులు చేశాము” అని తెలిపారు.

25
జీఎస్టీ కొత్త మార్పులతో చౌకయ్యే వస్తువులు

కొత్తగా జీఎస్టీలో చేసిన మార్పులతో కింద పేర్కొన్న వస్తువుల ధరలు తగ్గనున్నాయి. 

  • నిత్యావసరాలు (5%) – హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్, సైకిళ్లు, కిచెన్‌వేర్.
  • 5% నుంచి సున్నా – UHT పాలు, చెనా, పన్నీర్, రొటీ, పరాఠా.
  • 12%, 18% నుంచి 5% – నమ్‌కీన్, భుజియా, సాస్‌లు, పాస్తా, నూడుల్స్, చాక్లెట్లు, కాఫీ, కార్న్‌ఫ్లేక్స్, వెన్న, నెయ్యి.
  • 28% నుంచి 18% – ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషింగ్ మెషీన్లు, టీవీలు (32 ఇంచులకు పైగా), 350cc లోపు మోటార్‌సైకిళ్లు, చిన్న కార్లు.
  • ఔషధాలు – కేన్సర్, అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 33 మందులపై జీఎస్టీ పూర్తిగా తొలగింపు.
  • వ్యవసాయం & కూలి ఆధారిత వస్తువులు (5%) – ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మెషీన్లు, బయో-పెస్టిసైడ్లు, హస్తకళలు, లెదర్ గూడ్స్.
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఎనర్జీ – సిమెంట్ 28% నుంచి 18% కు, సౌర ప్యానెల్స్, విండ్‌మిల్స్, బయోగ్యాస్ ప్లాంట్లు 5%.
  • ఆటో రంగం (18%) – ఆటో పార్ట్స్, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లు, మూడు చక్రాల వాహనాలు.
  • ₹2,500 లోపు ధర కలిగిన పాదరక్షలపై 5%, దాని కంటే ఎక్కువ ఖరీదు ఉంటే 18% పన్ను ఉంటుంది.
35
ప్రత్యేక స్లాబ్ 40% - ఖరీదయ్యే వస్తువులు

జీఎస్టీ లో కొత్తగా చేసిన మార్పులతో ఈ కింది వస్తువుల ధరలు పెరుగుతాయి.

  • పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తులు.
  • ఎరేటెడ్ డ్రింక్స్, కార్బొనేటెడ్ బేవరేజీలు.
  • మిడ్, పెద్ద కార్లు, SUVs, 350cc పైగా మోటార్‌సైకిళ్లు.
  • పడవలు (Yachts), హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లు, వ్యక్తిగత నౌకలు.
45
బీమా, హెల్త్‌కేర్‌పై ఉపశమనం
  • అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు.
  • అన్ని హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీలపై కూడా మినహాయింపు.

విద్యుత్ వాహనాలు

ఎలక్ట్రిక్ వాహనాలపై 5% జీఎస్టీ యథావిధిగా కొనసాగుతుంది.

55
జీఎస్టీ కొత్త మార్పులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి?
  • జీఎస్టీ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 (నవరాత్రి మొదటి రోజు) నుంచి అమల్లోకి వస్తాయి.
  • పొగాకు ఉత్పత్తులు మొదట 28% ప్లస్ సెస్ కిందనే ఉంటాయి. తరువాత అవి 40% స్లాబ్‌కి మారతాయి.

మొత్తంగా గృహ ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారాలకు పన్ను క్రమబద్ధీకరణతో సులభతరం అవుతుంది. కానీ విలాస సరుకులు కొనేవారికి, పొగతాగే వారికి ఖర్చు మరింత పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories