ప్రభుత్వం అందిస్తున్న "లఖ్‌పతి దీదీ యోజన" మహిళల ఆర్థిక సాధికారతలో పెద్ద మార్పు తెస్తోంది. ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు వడ్డీ లేని రుణాలు పొందవచ్చు. ఈ లోన్ కోసం ఏం చేయాలంటే…
Government Schemes for Women : కాలం మారుతోంది... ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. గతంలో వంటగదికే పరిమితమైనవారు ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. పురుషులకు సమానంగా ఇంకా చెప్పాలంటే కొన్నిరంగాల్లో అంతకంటే ఎక్కువగా రాణిస్తున్నారు. ఉద్యోగాలే కాదు వ్యాపారాల్లోనూ దూసుకుపోతున్నారు.
అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మహిళలు బయటకు రావడంలేదు... ఇంకా అణచివేతకు గురవుతున్నారు. అందుకే పేద, మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడేలా కేంద్రం ఓ పథకాన్ని తీసుకువచ్చింది… అదే 'లఖ్‌పతి దీదీ'. ఈ స్కీమ్ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. పేద మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
26
వ్యాపారాల్లో దూసుకుపోతున్న మహిళలు
నేటి మహిళలు డెయిరీ ఫామ్‌ల నుంచి చిన్న పరిశ్రమల వరకు తమదైన ముద్ర వేస్తున్నారు. వారి స్ఫూర్తిని పెంచేందుకు కేంద్రం "లఖ్‌పతి దీదీ యోజన"ను అమలు చేస్తోంది. సంవత్సరానికి లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతోంది. ఆసక్తిగల మహిళలకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతోపాటు వ్యాపారానికి పెట్టుబడిగా వడ్డీలేని రుణాలు కూడా అందిస్తుంది ప్రభుత్వం.
36
రూ.5 లక్షల వడ్డీలేని రుణాలు
లఖ్‌పతి దీదీ పథకంలో విప్లవాత్మకమైన విషయం ఏంటంటే ఇది రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఈ పథకం కింద పూర్తి వడ్డీ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ డబ్బులను మహిళలు వ్యాపారం ప్రారంభించడానికి లేదంటే విస్తరణకు ఉపయోగించవచ్చు.
అయితే ఈ లఖ్‌పతి దీదీ పథకం అందరు మహిళలకు వర్తించదు.. కొన్ని అర్హతలుండాలి. మహిళలు SHG (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) లో సభ్యులై ఉండాలి. ఇందులోనూ 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి... అంతకంటే ఎక్కువ వయసుండి స్వయం సహాయక బృందంలో సభ్యులైన ఈ పథకానికి అనర్హులు.
56
ఈ రంగాల్లో మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించండి
ప్రభుత్వం అందించే వడ్డీలేని రుణాలతో మహిళలు హస్తకళలు, కుటీర పరిశ్రమలు, టైలరింగ్, డెయిరీ, పుట్టగొడుగుల పెంపకం లాంటివి మొదలుపెట్టొచ్చు. ప్రతి మహిళ ఏటా కనీసం రూ.1 లక్ష లేదంటే నెలకు రూ.10 వేలు సంపాదించేలా చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. అందుకే కేవలం వడ్డీలేని రుణాలిచ్చి చేతులు దులుపుకోకుండా పలు వ్యాపారాలపై ప్రభుత్వమే ఉచిత శిక్షణ కూడా ఇస్తుంది.
66
ఎలా దరఖాస్తు చేయాలి..?
ఈ పథకంలో చేరడానికి, మహిళలు తమ బ్లాక్ లేదా జిల్లా స్వయం సహాయక (SHG) కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి వ్యాపారం చేయాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో వెనకడుగు వేస్తున్న మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈజీగా వడ్డీలేని రుణం పొంది కలల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.